తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటున్న టీడీపీ మాజీ నేత  

Senior Tdp Leader Motkupalli Narsimhulu Set To Join Bjp-

తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణలో దళిత నేతగా, మంత్రిగా ఒక వెలుగు వెలిగిన నాయకుడు మోత్కుపల్లి నరసింహులు.ఇక తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఈ నేత, బాబు చేసిన నమ్మకద్రోహం సహించలేక ఆ పార్టీ నుంచి బయటకి వచ్చాడు.

Senior Tdp Leader Motkupalli Narsimhulu Set To Join Bjp- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు -Senior TDP Leader Motkupalli Narsimhulu Set To Join BJP-

బయటకి వస్తూ వస్తూనే చంద్రబాబు మీద నిప్పులు చెరిగాడు.తనని బాబు రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేసారని, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్నాడు అని ఘాటు విమర్శలు చేసారు.అదే సమయంలో ఏపీలో తెలుగు దేశం పార్టీ ఓటమికి కోసం ప్రచారం చేస్తానని చెప్పినట్లుగానే చాలా చోట్ల విమర్శలు చేసారు.

ఎన్నికల ముందు మోత్కుపల్లి విమర్శలు టీడీపీ మీద కొంత ప్రతికూల ప్రభావం చూపించాయనే చెప్పాలి.ఇక అప్పటి నుంచి ఎ పార్టీలో వెళ్ళకుండా ఖాళీగా ఉన్న ఈ నేత ఇప్పుడు బీజేపీ వైపు ద్రుష్టి సారిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.

తెలంగాణలో బలపడే ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ లో కీలక నేతలకి వలవేసి తన వైపు లాక్కుంది.అలాగే టీడీపీ తెలంగాణలో కనుమరుగు అయిన తర్వాత ఆ పార్టీలో సైలెంట్ గా ఉన్న నేతలని కూడా బీజేపీలో చేర్చుకుంటుంది.

ఈ నేపధ్యంలో కొంత వరకు బీజేపీ తెలంగాణలో హిందుత్వ వాదంతో బలపడే ప్రయత్నం చేస్తుంది.ఈ నేపధ్యంలో మోత్కుపల్లి బీజేపీ మీద ఆసక్తి కర వాఖ్యలు చేసి తాను పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేసారు.

హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ చేరేందుకు తేదీని ప్రకటిస్తామన్నారు.తెలంగాణలో తెరాస పార్టీ ప్రత్యామ్నాయంగా మరో పార్టీ లేదని, బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఎదగనుందని వెల్లడించారు.

దేశం కోసం బీజేపీ ఏంచేయడానికైనా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.