జబర్దస్త్ జడ్జి ఇంద్రజ అసలు పేరు మీకు తెలుసా..?

తెలుగులో తక్కువ సంఖ్యలోనే సినిమాల్లో నటించినా ఇంద్రజ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్న ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జిగా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Senior Star Heroine Indraja Real Name Details-TeluguStop.com

అయితే ఇంద్రజ ఒరిజినల్ నేమ్ ఇంద్రజ కానే కాదు.సినిమాల్లో గుర్తింపును సంపాదించుకోవడం కొరకు ఇంద్రజ తన పేరును మార్చుకోవడం గమనార్హం.

1978 సంవత్సరంలో చెన్నైలో జన్మించిన ఇంద్రజ అసలు పేరు రాజాతి.ఇంద్రజ నటి అయినప్పటికీ ఈమె మంచి సింగర్ కూడా కావడం గమనార్హం.

 Senior Star Heroine Indraja Real Name Details-జబర్దస్త్ జడ్జి ఇంద్రజ అసలు పేరు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఇంద్రజ సంగీత పోటీలతో పాటు నాటక పోటీలలో పాల్గొని బహుమతులను సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు మలయాళంలో సైతం ఇంద్రజ నటనకు మంచి పేరు వచ్చింది.

పెళ్లి తర్వాత ఇంద్రజ కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

టీవీ సీరియళ్లలో అన్ని రకాల పాత్రల్లో నటించడంతో పాటు తమిళంలో కొన్ని రియాలిటీ షోలకు ఇంద్రజ యాంకర్ గా కూడా పని చేశారు.ఈ మధ్య కాలంలో ఇంద్రజ సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో పాటు అల్లుడు అదుర్స్ సినిమాలో నటించారు.బుల్లితెరపై జడ్జిగా కూడా ఇంద్రజ మంచి పేరును సొంతం చేసుకున్నా తాత్కాలికంగానే ఆమె జబర్దస్త్ షోకు జడ్జిగా హాజరవుతున్నారు.

రోజా జబర్దస్త్ షోకు రీఎంట్రీ ఇస్తే ఇంద్రజ ఆ షోకు దూరం కావాల్సి ఉంటుంది.

ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడంతో కొన్నేళ్ల క్రితం ఇంద్రజ వార్తల్లో నిలిచారు.15 సంవత్సరాల వయస్సుల్లోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఇంద్రజ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడం గమనార్హం.అయితే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలనే ఎక్కువగా ఎంపిక చేసుకోవడం వల్ల ఇంద్రజకు పరిమితంగా ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం ఇంద్రజ కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నారని సమాచారం.

#SeniorStar #UnknownFacts #SeniorStar #Roja #Indraja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు