సీనియర్ స్టార్స్ ముగ్గురు డిజిటల్ ఎంట్రీకి రెడీ అయినట్లే

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో డిజిటల్ హవా నడుస్తుంది.భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసి చాలా మంది డిజిటల్ ఒటీటీ ప్లాట్ ఫామ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

 Senior Star Heroes Ready To Digital Entry-TeluguStop.com

ఇక ఈ రెండేళ్ళ నుంచి ఉన్న కరోనా పరిస్థితులు కూడా డిజిటల్ ఒటీటీలకి మంచి అవకాశంగా మారింది.థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో పాటు,సీరియల్స్ కి ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ చానల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

అందుకు తగ్గట్లుగానే డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్ లని ఆయా చానల్స్ ప్రేక్షకులకి అందిస్తూ కొత్త అనుభూతికి క్రియేట్ చేస్తూ వీక్షకుల సంఖ్యని పెంచుకుంటున్నాయి.డిజిటల్ ఒటీటీలకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి వాటి వైపు మొగ్గు చూపిస్తూ ఉండటంతో మొన్నటి వరకు ఎక్కువగా కొత్త ముఖాలతో కనిపించిన వెబ్ సిరీస్ లు ఇప్పుడు స్టార్స్ తో కళకళలాడుతూ ఉన్నాయి.

 Senior Star Heroes Ready To Digital Entry-సీనియర్ స్టార్స్ ముగ్గురు డిజిటల్ ఎంట్రీకి రెడీ అయినట్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సౌత్ లో ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఒటీటీ బాట పట్టారు.ప్రియమణి, తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత లాంటి స్టార్స్ ఒటీటీలో నటిస్తున్నారు.

అలాగే యంగ్ బ్యూటీస్ కూడా ఒటీటీలోకి అడుగుపెట్టారు.మాధవన్ లాంటి స్టార్ హీరో కూడా ఒటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ డిజిటల్ ఎంట్రీకి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు అయిన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ లోనే వెంకటేష్ జయంత్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ లో నటించడానికి ఒకే చెప్పాడు.అలాగే నాగార్జున కూడా ఓ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కి పచ్చజెండా ఊపారు.

అలాగే చిరంజీవితో వెబ్ సిరీస్ కోసం అహ ఒటీటీ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.వీళ్ళు డిజిటల్ ఎంట్రీ ఇస్తే వీరి దారిలో యంగ్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

#Samantha #Chiranjeevi #Web Series #SeniorStar #Tamannaah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు