శోభన్ బాబు రిజెక్ట్ చేసిన పవన్, మహేష్ సినిమాలివే..?

సినిమా రంగంలో చాలామంది హీరోలు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.కథ నచ్చక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే పాత్ర నచ్చినా వేర్వేరు కారణాల వల్ల హీరోలు మరికొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

 Senior Star Hero Sobhan Babu Rejected Movies List , Senior Star Hero, Sobhan Ba-TeluguStop.com

అలా శోభన్ బాబు కెరీర్ లో కూడా రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి.హీరోగా శోభన్ బాబు సినిమాలు తగ్గించిన తరువాత ఆయనకు సహాయ పాత్రల్లో, కీలక పాత్రల్లో నటించే ఆఫర్లు వచ్చాయి.

అయితే ఆ పాత్రల్లో నటించడానికి శోభన్ బాబు మాత్రం ఆసక్తిని కనబరచలేదు.ప్రేక్షకులు తనను హీరోగానే గుర్తు పెట్టుకోవాలని తన సినీ కెరీర్ కూడా హీరోగానే ముగిసిపోవాలని భావించి శోభన్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్టార్ హీరో నాగార్జున కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అన్నమయ్య ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించగా మొదట శోభన్ బాబుకు ఆ పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

Telugu Annamayya, Athadu, Mahesh Babu, Nagarjuna, Pawan Kalyan, Senior, Sobhan B

అయితే శోభన్ బాబు మాత్రం ఆ పాత్రలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.స్టార్ హీరో మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమాలో నాజర్ నటించిన పాత్రను సైతం శోభన్ బాబు రిజెక్ట్ చేశారు.అతడు నిర్మాత, నటుడు మురళీ మోహన్ బ్లాంక్ చెక్ ఇస్తానని చెప్పినా శోభన్ బాబు మాత్రం ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

Telugu Annamayya, Athadu, Mahesh Babu, Nagarjuna, Pawan Kalyan, Senior, Sobhan B

భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ పోషించిన పాత్రను సైతం శోభన్ బాబు రిజెక్ట్ చేశారు.అయితే చాలా సినిమాలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube