శోభన్ బాబు చేసిన ఏకైక బిజినెస్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్రా అందగాడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు తన సినీ కెరీర్ లో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబుకు చిన్నప్పటి నుంచే నాటకాలపై ఎంతో ఆసక్తి ఉండేది.

 Senior Star Hero Shoban Babu Movie Business Details-TeluguStop.com

పదుల సంఖ్యలో నాటకాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్న శోభన్ బాబు విజయవాడలో డిగ్రీని పూర్తి చేశారు.చిన్నప్పటి నుంచే శోభన బాబుకు సినిమాలంటే ఎంతో అభిమానం.

సీనియర్ ఎన్టీఆర్, భానుమతి నటించిన మల్లీశ్వరి సినిమాను శోభన్ బాబు ఏకంగా 22సార్లు చూశారు.శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు కాగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో శోభన్ బాబు తన పేరును మార్చుకున్నారు.

 Senior Star Hero Shoban Babu Movie Business Details-శోభన్ బాబు చేసిన ఏకైక బిజినెస్ ఏంటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భక్త శబరి సినిమా ద్వారా శోభన్ బాబు నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు పోషించిన శోభన్ బాబుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో సహాయం చేశారు.

Telugu Anr, Bhanumati, Laxmi Chitra, Malliswari Movie, Movie Business, Senior Ntr, Senior Star Hero, Shoban Babu, Shoban Babu Businesses, Shobana Chalapatirao-Movie

మనుషులు మారాలి సినిమాతో శోభన్ బాబు నటుడిగా స్థిరపడ్డారు.శోభన్ బాబు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు శత దినోత్సవాలను జరుపుకున్నాయి.సినిమాల ద్వారా బాగానే సంపాదించినప్పటికీ శోభన్ బాబు సినిమా వ్యాపారాలకు మాత్రం దూరంగానే ఉన్నారు.అయితే లక్ష్మీచిత్ర అనే ఒక పంపిణీ సంస్థకు మాత్రం శోభన్ బాబు ఆర్థిక సహాయం చేశారు.

ఈ వ్యాపారం మినహా శోభన్ బాబు మరే సినీ వ్యాపారం చేయలేదు.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు కూడా శోభన్ బాబుకు బాగానే ఫాలోయింగ్ ఉండేదని సమాచారం.

మహిళా ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో శోభన్ బాబు ఒక దశలో మహిళలకు నచ్చే సినిమాలలోనే ఎక్కువగా నటించారు.ఇప్పటికీ శోభన్ బాబు సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.

#ShobanBabu #Laxmi Chitra #Bhanumati #Senior Ntr #Shoban Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు