ఎన్టీఆర్ తో ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా తీస్తానంటున్న నిర్మాత !

ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు.కానీ వారిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సందించుకున్నారు ఈ సీనియర్ నిర్మాత.

 Senior Producer Ashwini Dutt Movie With Ntr, Ntr, Rrr, Rajamouli, Ashwini Dutt,-TeluguStop.com

వైజయంతి మూవీస్ గుంరించి చాలా మందికి తెలుసు.ఈయన సీనియర్ ఎన్టీఆర్ తో ఎదురులేని మనిషి సినిమాతో నిర్మాతగా మారారు చలసాని అశ్వనీదత్.

ఇప్పటికి ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కూడా నిర్మించారు అశ్వనీదత్.

తన 50 ఏళ్ల కెరీర్ లో ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన ఘనత వైజయంతి మూవీస్ సంస్థకు చెందుతుంది.అయితే ఈయనకు జూనియర్ ఎన్టీఆర్ తో సూపర్ హిట్ సినిమాలు తీయాలనే ఆశ ఉందట.

ఇప్పటికే అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసాడు.

ఆ మూడు సినిమాలలో స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అవ్వగా, శక్తి, కంత్రి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

దీంతో అశ్వనీదత్ తన కెరీర్ లో ఎన్టీఆర్ తో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చేయాలనీ ఆశగా ఉందట.ఈ క్రమంలో ఎన్టీఆర్, అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ చేయాలనీ ఎప్పటి నుండో అశ్వనీదత్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు.

Telugu Ashwini Dutt, Atlee, Rajamouli, Seniorashwini, Tollywood, Vyjayanthi-Movi

అయితే ఇన్ని రోజులకు అశ్వనీదత్ కల నెలవేరుతుందని తెలుస్తుంది.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా అయినా వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న బ్యానర్ పై నిర్మించనున్నారని తెలుస్తుంది.

Telugu Ashwini Dutt, Atlee, Rajamouli, Seniorashwini, Tollywood, Vyjayanthi-Movi

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఇవి అయితే కానీ ఎన్టీఆర్ మరొక సినిమా స్టార్ట్ చెయ్యదు.

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube