ఆ కాపు నేత పవన్ కళ్యాణ్ సిఎం అంటున్నారుగా! ఎలా అంటే  

పవన్ కళ్యాణ్ సిఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్న హరిరామజోగయ్య.

Senior Politician Says Pawan Kalyan Have Chance To Become A Cm-janasena,pawan Kalyan,senior Politician,tdp,ysrcp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయారు. మర 20 రోజులలో రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరికీ అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ ప్రతికూలంగా ఉంటాయి అనే విషయాలు ఓ వైపు చర్చిస్తూనే ఈ ఎన్నికలలో జనసేన సీట్ షేరింగ్ ఎంత ఉంటుంది. ఓటు షేరింగ్ ఎంత ఉంటుంది అనే విషయాలపై కూడా చర్చ నడుస్తుంది..

ఆ కాపు నేత పవన్ కళ్యాణ్ సిఎం అంటున్నారుగా! ఎలా అంటే -Senior Politician Says Pawan Kalyan Have Chance To Become A CM

పవన్ కళ్యాణ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపెట్టే అవకాశం ఇప్పుడు లేకపోయిన కచ్చితంగా ప్రభుత్వంలో ఎవరుండాలో డిసైడ్ చేసే స్థాయిలో ఉంటాడని చాలా మంది చెబుతున్న మాట.

ఇదిలా ఉంటే సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్య కూడా తాజాగా పవన్ కళ్యాణ్ సత్తాపై ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఎం అయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని తాజాగా చెప్పుకొచ్చారు.

ఈ సారి ఏపీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కచ్చితంగా మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన మద్దతు లేకుండా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అభిప్రాయ పడ్డారు. మరి హరిరామజోగయ్య జోగయ్య విశ్లేషణ ఎంత వరకు ఏపీ రాజకీయాలలో వాస్తవరూపం దాల్చుతుందో అనేది వేచి చూడాలి.