తెలుగు సినీ చరిత్రలో 'ఎన్టీఆర్' గారి ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరితరమూ కాలేదు.! అదేంటో చూడండి!

ఎన్ టి రామారావు…ప్రతి తెలుగు ఇంటికి పరిచయమైన పేరు.ఎంతో మంది అన్న అని పిలిచిన పేరు.

 Senior Ntr Unbreakable Records In Telugu Film Industry-TeluguStop.com

కేవలం సినిమాలతోనే కాదు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసి రాష్ట్రప్రజల ప్రశంసలు అందుకున్న మహానుభావుడు.తెలుగు సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసికెల్లిన మొదటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు.

ఆయన అందుకున్న అవార్డులు దీనికి సాక్షం.

అప్పట్లొ ప్రతి సంవత్సరం రిలీజు అయ్యే సినిమాలలో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకున్నాయి.అయితే వీటిలో ఒకే హీరో సినిమాలు విరామం లేకుండా ప్రతి సంవత్సరం కనీసం ఒక శతదినోత్సవం జరుపుకుంటూ వరసగా కొన్ని సంవత్సరాలు నమోదయ్యాయి.ఇటువంటి రికార్డును రామారావు గారు విరామం లేకుండా 33 సంవత్సరాలు నమోదు చేశారు…1950 నుంచి 1982 వరకు ఆయన సినిమాలు ప్రతి సంవత్సరం శత దినోత్సవాలు నమోదయ్యాయి.

అసలిప్పుడు ఒక సినిమా వంద రోజులు ఆడింది అంటేనే గ్రేట్.కానీ అప్పట్లోనే మన రామ రావు గారు ఈ ఘనత సాధించారు.

ఈ రికార్డు ఎప్పటికి బద్దలయ్యే అవకాశమే లేదు, చిరంజీవి 1996 లో సినిమా రిలీజు చేయలేదు.ఒకవేల చేసుంటే 26 సంవత్సరాల రికార్డు అయ్యేది….ఇక రెండవ స్థానంలో అక్కినేని నాగేశ్వరరావు గారు 20 సంవత్సరాల(1955 నుంచి 1975)రికార్డు కలిగి ఉన్నారు.మూడవ స్థానంలో 16 సంవత్సరాలు సంయుక్తంగా చిరంజీవి (1980నుంచి 1995)నాగార్జున (1991 నుంచి 2006) వరకు కలిగి ఉన్నారు.

బాలక్రిష్ణ 14 సంవత్సరాలు (1989 నుంచి 2002) సూపర్ స్టార్ కృష్ణ (1976నుంచి 1986)11సంవత్సరాలు కలిగి ఉన్నారు… పై రికార్డులను ఇప్పటి తరం హీరోలు చేరుకోవటం అసంభవం, మొదటిరోజు, వారం,నాలుగు వారాల రికార్డులు తప్ప శతదినోత్సవాలు జరుపుకోనీ ఈ రోజుల్లో వీటిని చేరుకోవటం కుదరని పనే కదా.ఏమంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube