సిగ్గు లేదా మీకు అంటూ ఆ నటిని తిట్టిన సీనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలల్లో  ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి.ఈ సినిమాల్లో  కొన్ని సినిమాలు కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.

 Senior Ntr Serious On Actress Lakshmi Why Because Details, Actress Lakshmi, Seni-TeluguStop.com

తన సినిమాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు.సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఒకే కుటుంబం, బంగారు మనిషి సినిమాలలో లక్ష్మీ నటించారు.

ఆహారాన్ని ఎవరైనా వృథా చేస్తే సీనియర్ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చదు.

అయితే ఒకరోజు నటి లక్ష్మి దోసెలు  సగం తిని వెళ్లిపోతుండగా రామారావు గారు ఆమె ఆహారాన్ని వృథా చేయడం చూసి “ఏవండీ లక్ష్మిగారూ.

ఇటు రండి” అని పిలిచారు.సీనియర్ ఎన్టీఆర్ వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ గౌరవంగా పిలిచేవారు.

పేరు పెట్టి పిలవడం సీనియర్ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చేది కాదు.ఆ తర్వాత ఎన్టీఆర్ లక్ష్మితో ఏ ఆహారం తీసుకున్నా జీర్ణించుకునే శక్తి ఉన్న వయస్సు మీదని అలాంటి వయస్సులో సగం దోసె తింటారా? అంటూ సీరియస్ అయ్యారు.

సిగ్గు లేదా మీకు? అంటూ రామారావు లక్ష్మిని తిట్టగా లక్ష్మి ఎన్టీఆర్ తో మర్యాదగా పిలిచి తిడుతున్నారని అన్నారు.

Telugu Actress Lakshmi, Bangaru Manishi, Oke Kutumbam, Senior Ntr, Sr Ntr Lakshm

ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మీరు చిన్నపిల్లలని బాగా తినాలని రోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సీనియర్ ఎన్టీఆర్ సూచనలు చేశారు.స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని సీనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.ఈ విధంగా ఎవరైనా తప్పు చేస్తే సీనియర్ ఎన్టీఆర్ సున్నితంగా మందలించేవారు.

Telugu Actress Lakshmi, Bangaru Manishi, Oke Kutumbam, Senior Ntr, Sr Ntr Lakshm

సీనియర్ ఎన్టీఆర్ తను తినే ఆహారాన్ని ఎప్పుడూ ఇంటినుంచే తెప్పించుకొని తినేవారు.;పూరీలు , దోసెలు, హల్వా, కారప్పూస, యాపిల్ జ్యూస్ సీసాలు ఆయన ఆహారంలో ఉండేవి.తీసుకునే ఆహారం విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube