ఇంట్లో ఉన్న బాలయ్యను తిట్టిన సీనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

నటుడిగా, ప్రజా నాయకుడిగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.400కు పైగా సినిమాలలో నటించి సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో మెప్పించారు.కొన్ని చిత్రాలకు సీనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకుడిగా కూడా పని చేశారు.పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా సీనియర్ ఎన్టీఆర్ నిలిచారు.

 Senior Ntr Scolded Nandamuri Balakrishna Why Because, Nandamuri Balakrishna, Sc-TeluguStop.com

పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే ఎన్టీఆర్ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రముఖ రాజకీయ నేతలను సైతం అవాక్కయ్యేలా చేశారు.ఉమ్మడి ఏపీకి సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడం గమనార్హం.

రామారావు కాలేజీ రోజుల్లో కొన్ని కారణాల వల్ల ఆయన ఆస్తి హరించుకుపోగా ఆ సమయంలో ఎన్టీఆర్ వేర్వేరు వ్యాపారాలు చేశారు. ఆర్థిక సమస్యలు ఎదురైనా సీనియర్ ఎన్టీఆర్ అప్పు చేయడం మాత్రం ఇష్టపడేవారు కాదు.

Telugu Aditya, Bharava Dvipam, Scolded, Senior Ntr, Tollywood-Movie

ప్రముఖ దర్శకులలో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమాలలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. కేవీ రెడ్డి శిష్యుడైన సింగీతం శ్రీనివాసరావు సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని భావించినా వర్కౌట్ కాలేదు.అయితే సింగీతం శ్రీనివాసరావు బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన భైరవ ద్వీపం, ఆదిత్య 369 సినిమాలు సక్సెస్ సాధించాయి.

Telugu Aditya, Bharava Dvipam, Scolded, Senior Ntr, Tollywood-Movie

ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరిగే టైమ్ లో సింగీతం బాలయ్యను ఒకసారి ఆలస్యంగా షూట్ కు రావాలని సూచించారు.ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఉన్న బాలయ్యను చూసి షూటింగ్ లేదా అని అడగగా దర్శకుడు ఆలస్యంగా రమ్మని సూచించారని బాలయ్య చెప్పారు.ఆ సమయంలో ఎన్టీఆర్ నిర్మాతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండటానికి డబ్బులు ఇస్తున్నారని మేకప్ వేసుకొని షూటింగ్ కు వెళ్లమని బాలయ్యకు చెప్పారు.

అప్పటినుంచి షూటింగ్ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలను బాలకృష్ణ ఫాలో అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube