ఎన్టీఆర్ రూమ్ మేట్ తో కలిసి తీసిన సినిమా ఏంటి..? హిట్టా..ఫట్టా..?

స్టార్ హీరోలుగా ఎదిగిన వారు సైతం సినిమాల్లో అవ‌కాశం కోసం.తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎద‌ర్కొన్న వాళ్లే.

 Senior Ntr Movie With His Room Mate Thotakura Venkata Raju Is Hit Or Flop-TeluguStop.com

ఇప్పుడు సినిమా ఆఫ‌ర్ల కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్లుగానే.అప్ప‌ట్లో మ‌ద్రాసుకు వెళ్లేవారు.

అలా సినిమాల కోసం చెన్నై వెళ్లిన ఎన్టీఆర్‌కు ఓ వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు.ఆయ‌న‌తో పాటు క‌లిసి చాలా కాలం ఒకే రూంలో ఉన్నారు.

 Senior Ntr Movie With His Room Mate Thotakura Venkata Raju Is Hit Or Flop-ఎన్టీఆర్ రూమ్ మేట్ తో కలిసి తీసిన సినిమా ఏంటి.. హిట్టా..ఫట్టా..-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి రెండు సినిమాలు చేశారు.ఇంత‌కీ ఎన్టీఆర్‌తో క‌లిసి ఉండి.

సినిమాలు చేసిన వ్య‌క్తి ఎవ‌రు? ఆయ‌న‌తో చేసిన చిత్రాలు ఏవి? అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం!

చెన్నైలో సినిమాల కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలో ఎన్టీఆర్‌కు తోట‌కూర వెంక‌ట రాజు క‌లిశారు.ఎన్టీఆర్ హీరో అవ‌కాశం కోసం ట్రై చేస్తుంటే.

రాజు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.ఇద్ద‌రు క‌లిసి ఒకే అద్దె గ‌దిలో ఉండేవారు.

రాజ‌మండ్రికి చెందిన రాజు.కృష్ణ‌మాచార్యుల ద‌గ్గ‌ర సంగీతం నేర్చుకున్నాడు.

నాటిక‌ల్లో హ‌ర్మోనియం ప్లే చేసేవాడు.సినిమా అవ‌కాశాల కోసం మ‌ద్రాసుకు వెళ్లిన ఆయ‌న‌కు ఎన్టీఆర్ తార‌స‌ప‌డ్డారు.

Telugu Balanagamma Mahatyam, Chennai, Music Director, Ntr, Panduranga Mahatyam, Sr Ntr, Sr Ntr Friend, Sr Ntr Movie With Room Mate, Sr Ntr Room Mate, Srikrishna Pandaveeyam, Thotakura Venkata Raju-Telugu Stop Exclusive Top Stories

ఎన్టీఆర్‌కు 1949లో మ‌న‌దేశం సినిమాలో హీరోగా ఛాన్స్ వ‌చ్చింది.ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో అన్న స్టార్ హీరోగా ఎదిగాడు.అటు తోట‌కూర వెంక‌ట రాజు 1952లో టింగు రంగ అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు.ఇద్ద‌రూ మంచి గుర్తింపు పొందారు.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్ హీరోగా, తోట‌కూర వెంక‌ట రాజు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రెండు సినిమాలు చేశారు.ఆ రెండు చిత్రాలు క‌థ ప‌రంగానే కాకుండా.

మ్యూజిక్ ప‌రంగానూ సూప‌ర్ హిట్ అయ్యాయి.ఈ రెండు సినిమాల్లో ఒక‌టి పాండురంగ మ‌హ‌త్యం కాగా.

మ‌రొక‌టి శ్రీకృష్ణ పాండ‌వీయం.వీరిద్ద‌రూ క‌లిసి బాల‌నాగ‌మ్మ మ‌హ‌త్యం అనే సినిమాకు నిర్మాత‌లుగా చేశారు.ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.డ‌బ్బులు కూడా బాగానే రాబ‌ట్టింది.వీరిద్ద‌రి స్నేహం చాలా కాలం కొన‌సాగింది.

#Chennai #Music Director #Sr Ntr Friend #SrNtr #Sr Ntr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు