50 సంవత్సరాల క్రితమే ఆర్ఆర్ఆర్ ను మించిన సినిమా తెలుగులో వచ్చిందా.. ఏ మూవీ అంటే?

ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగులో ఎన్నో సంచలన రికార్డులను సృష్టించింది.ఈ సినిమా విడుదలై నాలుగు వారాలైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా కొనసాగుతోంది.

 Senior Ntr Kanchukota Movie Rare Records Than Rrr Movie Details, Rrr Movie, Kanc-TeluguStop.com

చరణ్, ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండటంతో పాటు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, సినిమాలోని అద్భుతమైన సీన్లు ఈ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించాయి.ఆర్ఆర్ఆర్ విడుదలై నాలుగు వారాలైనా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.

అయితే 50 సంవత్సరాల క్రితమే ఆర్ఆర్ఆర్ ను తలదన్నే సినిమా తెలుగులో వచ్చింది.సీనియర్ ఎన్టీఆర్ నటించిన కంచుకోట సినిమా ఆ కాలంలోనే అంచనాలకు మించి కలెక్షన్ల విషయంలో రికార్డులను సృష్టించింది.

త్రిపురనేని మహారథి ఈ సినిమాకు కథ అందించగా సి.ఎస్.రావు ఈ సినిమాకు కథ అందించారు.కాంతారావు, సావిత్రి, దేవిక, ఉదయ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

కె.వి.మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించగా జానపద చిత్రాలలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

Telugu Devika, Ntr, Kanchu Kota, Kanchukota, Kantharao, Rajamouli, Ram Charan, R

ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఏడు రోజుల్లో 7 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.రిపీట్ రన్ లో కూడా ఈ సినిమా కొన్ని థియేటర్లలో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది.ఈ సినిమా తర్వాత పదుల సంఖ్యలో జానపద సినిమాలు వచ్చినా ఈ సినిమా స్థాయిలో సక్సెస్ కాలేదు.

Telugu Devika, Ntr, Kanchu Kota, Kanchukota, Kantharao, Rajamouli, Ram Charan, R

ఇప్పటి ఆర్ఆర్ఆర్ సినిమాను మించి ఈ సినిమా ఉందని నెటిజన్లు సైతం ఏకీభవిస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube