స్నేహితుడు జగ్గయ్య కంటే ఆ నటుడికే ప్రాధాన్యత ఇచ్చిన ఎన్టీఆర్.. ఏమైందంటే?

తను హీరోగా నటించిన సినిమాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది నటులను పరిచయం చేయడంతో పాటు ప్రతిభ ఉన్న ఎంతోమంది నటులను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.నటుడు కాంతారావుకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం.

 Senior Ntr Gave More Importance To Kantarao Than Jaggayya-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో కీలక పాత్రల కోసం కాంతారావును రికమెండ్ చేయడం జరిగింది.ఒక విధంగా కాంతారావుకు మంచి పేరు రావడానికి సీనియర్ ఎన్టీఆర్ కారణమని చెప్పవచ్చు.

లవకుశ మూవీలో లక్ష్మణుడి వేషం వేయడానికి దర్శకనిర్మాతలు ఇతర నటుల పేర్లను పరిశీలిస్తుండగా రామారావు ఆ పాత్రను కాంతారావుకు ఇవ్వాలని సూచనలు చేశారు.అవకాశాలు లేక ఆదాయం సరిపోక కాంతారావుకు ఇబ్బందులు ఎదురు కాగా ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ దేవుడిలా కాంతారావుకు ఆఫర్లు ఇచ్చి మంచి మనస్సును చాటుకున్నారు.

 Senior Ntr Gave More Importance To Kantarao Than Jaggayya-స్నేహితుడు జగ్గయ్య కంటే ఆ నటుడికే ప్రాధాన్యత ఇచ్చిన ఎన్టీఆర్.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వకముందే ఆయనకు జగ్గయ్య స్నేహితుడిగా ఉండేవారు.

జయసింహ సినిమాలో మొదట ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర కోసం జగ్గయ్య ఎంపిక కాగా ఎన్టీఆర్ మాత్రం ఆయనకు బదులుగా కాంతారావుకు ఛాన్స్ ఇచ్చారు.

Telugu Anr, Anr Rahasyam Movie, Jaggayya, Jayasimha Movie, Kantarao, Kantarao Less Remuneration, Lakshmana Character, Lavakusha Movie, More Importance, Senior Ntr Friend Jaggaya, Tollywood-Movie

ఈ సినిమాతో కాంతారావు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.అయితే ఆ తర్వాత కాలంలో ఏఎన్నార్ సినిమాల్లో జగ్గయ్యకు ఎక్కువగా అవకాశాలు లభించాయి.స్నేహితుడిని కాదని సీనియర్ ఎన్టీఆర్ కాంతారావుకు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

Telugu Anr, Anr Rahasyam Movie, Jaggayya, Jayasimha Movie, Kantarao, Kantarao Less Remuneration, Lakshmana Character, Lavakusha Movie, More Importance, Senior Ntr Friend Jaggaya, Tollywood-Movie

జగ్గయ్య పారితోషికం కంటే కాంతారావు పారితోషికం తక్కువ కావడంతో ఆయనకు ఆఫర్లు ఎక్కువగా లభించాయని కొంతమంది దర్శకనిర్మాతలు చెబుతారు.అయితే ఏఎన్నార్ మూవీ రహస్యంలో తనకు చెప్పకుండా కాంతారావు నటించారని ఎన్టీఆర్ సీరియస్ అన్నారు.ఈ రీజన్ వల్ల ఎన్టీఆర్ కాంతారావును కొన్ని నెలల పాటు దూరం పెట్టారు.

ఆ తర్వాత ఎన్టీఆర్, కాంతారావు కలిసి మళ్లీ సినిమాల్లో నటించారు.

#Jaggayya #Kantarao #Jayasimha #Lavakusha #Anr Rahasyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు