రజనీకాంత్ కు ఆరోగ్యం విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సలహా ఇదే?

సౌత్ ఇండియాలో భారీ స్థాయిలో క్రేజ్, పాపులారిటీ ఉన్న స్టార్ హీరోలలో రజనీకాంత్ కూడా ఒకరు.యావరేజ్ టాక్ తో సైతం కొత్త రికార్డులు క్రియేట్ చేయగల టాలెంట్ రజనీకాంత్ సొంతమని చెప్పవచ్చు.

 Senior Ntr Advice To Star Hero Rajanikanth About Health Details, Rajnikanth, Sen-TeluguStop.com

దీపావళికి రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తే సినిమా థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది.ఒక్కో సినిమాకు రజనీకాంత్ భారీస్థాయిలో రెమ్యునరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అన్నాత్తే సినిమా డైరెక్టర్ శివ రజనీకాంత్ తర్వాత సినిమాకు కూడా దర్శకత్వం వహించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.సినిమాల్లోకి రాకముందు ఈ స్టార్ హీరో బస్ కండక్టర్ గా పని చేశారు.

బస్ కండక్టర్ గా పని చేసిన సమయంలో రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని పౌరాణిక సినిమాలను రజనీకాంత్ చాలాసార్లు చూశారని తెలుస్తోంది.

సీనియర్ ఎన్టీఆర్ నటన వల్ల ఎన్టీఆర్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ పై కూడా రజనీకాంత్ కు ఊహించని స్థాయిలో అభిమానం పెరిగింది.

Telugu Bus, Rajanikanth, Rajnikanth, Rajnikanthntr, Senior Ntr, Sr Ntr Fan, Stag

రజనీకాంత్ కండక్టర్ గా పని చేసే సమయంలో స్టాఫ్ తో కలిసి ఒక నాటకాన్ని ప్రదర్శించగా అందులో రజనీకాంత్ దుర్యోధనుడి వేషం వేశారు.ఆ వేషం వల్ల రజనీకాంత్ నటనకు ప్రశంసలు దక్కాయి.ఆ తర్వాత సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించి నటుడిగా రజనీకాంత్ సక్సెస్ అయ్యారు.

Telugu Bus, Rajanikanth, Rajnikanth, Rajnikanthntr, Senior Ntr, Sr Ntr Fan, Stag

టైగర్ సినిమాలో రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు.ఆ సమయంలో మెదడులో నరాలకు ఒత్తిడి కలగడం వల్ల రజనీకాంత్ మానసిక సమస్యతో బాధపడేవారు.సీనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్ పరిస్థితిని గమనించి తెల్లవారుజామున ప్రాణాయామం చేయాలని రజనీకాంత్ కు సూచించారు.ఎన్టీఆర్ ఇచ్చిన సలహా వల్ల రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడింది.రజనీకాంత్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube