ముండమోపిలా ఏడుపులెందుకు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు విష్ణు ప్యానల్ సభ్యుల గురించి, మోహన్ బాబు గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా సీనియర్ నరేష్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 Senior Naresh Shocking Comments About Resigning Members-TeluguStop.com

అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలను చేపట్టడంతో తనకు సంతోషంగా ఉందని నరేష్ చెప్పుకొచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పెత్తందారీ వ్యవస్థ పోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సేవా సంస్థ అని ఆ సంస్థకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని నరేష్ తెలిపారు.

 Senior Naresh Shocking Comments About Resigning Members-ముండమోపిలా ఏడుపులెందుకు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏకగ్రీవాలు మాత్రమే ఉండాలని నరేష్ కామెంట్లు చేశారు.ఎమోషన్స్ వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల మా ను డిస్టర్బ్ చేయవద్దని నరేష్ కోరారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ చేసిన రాజీనామాల గురించి కొత్త కార్యవర్గం చూసుకుంటుందని నరేష్ చెప్పుకొచ్చారు.

Telugu Comments, Maa Elections, Manchu Vishnu, Movie Artist Association, Prakash Raj, Resigning Members, Senior Naresh, Tollywood-Movie

ముండమోపిలా ఏడుపులెందుకు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఏడ్చిన వాళ్ల గురించి నరేష్ కామెంట్లు చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఓడినా, విజయం సాధించినా కలిసి పని చేస్తామని చెప్పారని మాట మీద నిలబడాలని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కుటుంబ సభ్యులు విడిపోరని గెస్ట్ లు మాత్రం విడిపోతారని నరేష్ కామెంట్లు చేశారు.

మోదీ గెలిస్తే కాంగ్రెస్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుందా? అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులలో కొంతమంది మగవాళ్లు కూడా ఏడవటం తాను చూశానని నరేష్ అన్నారు.అతిగా ఏడ్చే మగవాళ్లను నమ్మకూడదంటూ నరేష్ కామెంట్లు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లుగా ఉంటే కొడతారా? తిడతారా? అని నరేష్ ప్రశ్నించారు.

#MAA #Manchu Vishnu #Prakash Raj #Naresh #Members

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు