సీనియర్ల లో సిన్సియార్టీ ఎంత ? బాబుకే వెన్నుపోటు ?

తెలుగుదేశం పార్టీ లో సీనియర్ నాయకులకు కొదవేమీ లేదు.పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు, చంద్రబాబు కోటరీ నాయకులుగా చెప్పుకుంటున్న సీనియర్లు ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు.

 Senior Leaders Who Remain Silent And Cause Damage To The Tdp-TeluguStop.com

ఎంత మంది యువ నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకులకు సముచిత స్థానం అధినేత చంద్రబాబు ఎప్పుడూ కల్పిస్తూ వస్తున్నారు.కాకపోతే కొంతమంది సందర్భంను బట్టి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవుల్లోనూ, ప్రాధాన్యం లోనూ చంద్రబాబు పెద్ద పీట వేస్తూనే వచ్చారు.అయితే పార్టీ అధికారానికి దూరం అయినప్పటి నుంచి సీనియర్ నాయకులు చాలా మందిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

 Senior Leaders Who Remain Silent And Cause Damage To The Tdp-సీనియర్ల లో సిన్సియార్టీ ఎంత బాబుకే వెన్నుపోటు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.టిడిపి కష్టాల్లో ఉన్నా, అధినేత చంద్రబాబు చూసుకుంటాడులే అన్న ధీమా వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.

దీని కారణంగా టిడిపికి పెద్ద ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.

సీనియర్ నాయకులుగా ఉన్న వారు తమ అనుభవాన్ని ఉపయోగించి తమ ప్రాంతంలోనూ, తమ నియోజకవర్గాల పరిధిలోని పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే విషయం పైన , యువ నాయకులకు తమ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఎత్తుగడలు, ప్రజా బలం పెంచుకోవడం వంటి విషయాలలో అనేక సూచనలు చేయాల్సి ఉన్నా ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్లుగా సైలెంట్ గా ఉంటున్నారు.

ఇటీవల చంద్రబాబు పెద్ద ఎత్తున పార్టీ పదవులను భర్తీ చేశారు.జాతీయ, రాష్ట్ర స్థాయి పదవులు భర్తీ చేశారు.వాటిల్లోనూ సీనియర్ నాయకులకు పెద్దపీట వేశారు.అతి కొద్ది మంది తప్ప,  మిగతా నాయకులంతా మౌనంగా ఉండిపోతుండడం , ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడం, ప్రజా సమస్యలపై గొంతెత్తడం వంటివి చేయకుండా , అంతా బాబు పైనే భారం అన్నట్టుగా వ్యవహరిస్తుండడం వంటివి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Telugu Ap Cm, Chandrababu Naidu, Jagan, Ntr, Tdp, Tdp Senior Leaders, Ysr, Ysr Cp Government-Telugu Political News

అయితే ఎప్పటికప్పుడు నాయకులు దారిలోకి వస్తారు అన్నట్లుగా సైలెంట్ గానే ఉంటున్నా, సీనియర్లు మాత్రం చేతులు ఎత్తివేసినట్టు గా వ్యవహరిస్తూ , పార్టీలో తాము పేరుకే ఉన్నాం పదవులు ఇస్తే తీసుకుంటాం అన్నట్టుగా లో వ్యహరిస్తున్న కొంతమంది సీనియర్ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపడం తో , అక్కడ అటువంటివారే యాక్టివ్ గా ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.మిగతా వారంతా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.టిడిపి సీనియర్లు పరోక్షంగా బాబుకు వెన్నుపోటు పొడుస్తున్నట్లుగా తయారయ్యారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

#Jagan #AP Cm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు