కాంగ్రెస్ సీనియర్స్ కి సర్వేల భయం   Senior Leaders Shocking News Congress Started Survey     2017-10-31   23:24:30  IST  Bhanu C

కాంగ్రెస్ పార్టీ కురువృద్దుల భవితవ్యం ఇప్పుడు కాంగ్రెస్ చేపట్టే సర్వేల పై ఆధారపడి ఉంది.తెలంగాణలో ప్రతీ నియోజకవర్గం లో కాంగ్రెస్ సర్వే చేపట్టనుంది. ఇప్పుడు టిఆర్ఎస్ లాంటి బలమైన పార్టీని ఎదుర్కోవాలంటే ఎవరి స్టామినా ఎలా ఉందొ.. నిజంగా బలమైన అభ్యర్ధులు ఎవరు అనేది తేలాలి..సీనియర్స్ ఇచ్చే సిపార్సులు కూడా కాంగ్రెస్ ఇప్పుడు పక్కన పెట్టనుంది..సర్వేల ఆధారంగానే కధ నడపనుంది.రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో మరింత జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఊపుని కొనసాగించాలి అంటే..ఇక మీదట అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

రాహుల్ ప్రత్యేకంగా సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేల కోసం రాహుల్ అనుమతి తీసుకున్నారు. వచ్చే నెల నుంచి సర్వేలు మొదలు పెట్టనున్నారు. సర్వేలను కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థకు అప్పగించనున్నారు. ఇప్పుడు ఈ సర్వేలు ఎవరి సీటుకి ఎసరు పెడుతాయో అని తెగ కలవర పడిపోతున్నారు సీనియర్ నేతలు.

ఇప్పుడు కాంగ్రెస్ కి ఉన్న ఊపు చూస్తుంటే..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్స్ కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు..ఈ జోష్అంతా రేవంత్ వల్లనే కలిగింది అనేది రాహుల్ బలంగా నమ్ముతున్నాడు.ఈ నేపధ్యంలో నవంబరు 19వ తేదీన రాహుల్ తెలంగాణ పర్యటనలో వరంగల్ లో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని, సర్వేల్లో గెలుపు అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు దక్కుతాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయి అనగా ఈ సర్వేలు ఆధారంగానే..అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.అంతేకాదు రాహుల్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ కి మరింత ఊపు వస్తుంది..ఇప్పుడు రేవంత్ టి –కాంగ్రెస్ లో చెప్పిందే వేదం..ఇక పాదయాత్ర తరువాత టికెట్స్ ఎవరికీ ఎక్కడ ఇస్తే బాగుంటుంది అనేది సర్వేల ఆధారంగా నిర్ణయించే హోదాలో రేవంత్ ఉంటాడు..మరి రేవంత్ సీనియర్స్ ని ఉంచుతాడో..యువకులకి అవకాసం కోసం దించుతాడో అని సీనియర్స్ లో అప్పుడే కలవరం మొదలయ్యింది. మొత్తం మీద రేవంత్ భయం..సర్వేల భయం సీనియర్స్ లో టెన్షన్ పెడుతున్నాయి.