రాజకీయానికి టీడీపీ సీనియర్లు దూరం ? భారం కాకపోయినా..? 

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పై పట్టు సాధించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నా, ఏదో ఒక అంశం తో ప్రజల్లోకి వెళ్తూ పోరాటాలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో అయితే ఫలితం ఉన్నట్లు కనిపించడం లేదు.దీనికితోడు పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకున్న పరిణామాలు మరింత కంగారు పుట్టిస్తున్నాయి.

 Senior Leaders In The Tdp Are Not Active Tdp, Chandrababu, Jagan, Ysrcp, Tdp Sen-TeluguStop.com

ముఖ్యంగా టిడిపిలో సీనియర్ నాయకుల ప్రభావం బాగా తగ్గిపోయింది.ఆ స్థానంలో జూనియర్ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో యువ నాయకులకు ఎక్కువగా సీట్లు కేటాయించే పరిస్థితి ఉండడం, రాజకీయంగా కోలుకోలేని విధంగా టిడిపి ఎదురు దెబ్బలు తినడం , ఇలా అనేక కారణాలతో రాజకీయాలపై సీనియర్ నాయకులు నిరాశాక్తి తో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.

2024లో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా సీనియర్ నాయకుల్లో కనిపించడం లేదు అందుకే వారు రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అనే అభిప్రాయం లో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. 

      గతంతో పోలిస్తే టిడిపి సీనియర్ లు పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు.

వారి స్థానంలో వారి వారసులు యాక్టివ్ అవ్వడం, ఇంకొంతమంది పూర్తిగా తాము, తమ కుటుంబసభ్యులు రాజకీయాలకు దూరం అని ప్రకటించడం,  ఇలా అనేక కారణాలతో సీనియర్ల ప్రభావం టిడిపిలో కనిపించడం లేదు.ఇప్పటికే అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేత జేసి దివాకర్ రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు.2019 ఎన్నికల్లో జేసీ కుమారుడు ఇక్కడ పోటీ చేసి ఓటమి చెందారు .         

Telugu Chandrababu, Jagan, Jc Brothers, Tdp, Ysrcp-Telugu Political News

అలాగే చంద్రబాబు స్థాయి నాయకుడిగా టీడీపీలో అత్యంత సీనియర్ గా పేరుపడిన కర్నూలు జిల్లా నేత కెఈ కృష్ణమూర్తి రాజకీయాలకు దూరమయ్యారు.తాను రాజకీయాల్లో ఉండబోనని ప్రకటన చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కుమారుడు శ్యాంబాబు కు 2019 ఎన్నికల్లో పత్తికొండ నుంచి పోటీ చేయించారు.  ఆయనా ఓటమి చెందారు.

అలాగే చిత్తూరు జిల్లాలో కీలకంగా ఉన్న గల్లా ఫ్యామిలీ విషయానికి వస్తే , మాజీ మంత్రి అరుణ కుమారి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.ఆయన కుమారుడు జయదేవ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.

టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడు వంటివారు సైలెంట్ అయిపోయారు.  పరిస్థితి ఇదే విధంగా ఉంటే 2024 ఎన్నికల నాటికి టిడిపి లో సీనియర్ల ప్రభావం పూర్తిగా తగ్గి, అనేక ఇబ్బందులు తప్పవు అనే చెప్పాలి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube