సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది

ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జంధ్యాల సినిమా అంటే శ్రీలక్ష్మి కామెడీ పక్కాగా ఉండేది.

 Senior Lady Comedian Srilakshmi Movie As A Main Lead-TeluguStop.com

స్టార్ కమెడియన్స్ తో సమానంగా ఆమె సినిమాలో హాస్యాన్ని పండించేది.గ్రామీణ ప్రాంతాలలో నవల పిచ్చి ఉన్న ఆడవాళ్ళు, దైవభక్తి ఎక్కువైపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే కొత్త కొత్త వంటలని ప్రయోగాలు చేసేవారు ఎలా ఉంటారు అనే విషయాలని శ్రీ లక్ష్మి పాత్రతో జంధ్యాల తన సినిమాలలో చెప్పించేవారు.

రమాప్రభ తర్వాత లేడీ కమెడియన్ గా శ్రీలక్ష్మి తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది.ఇక ఆ తరువాత అనుకున్న స్థాయిలో పాత్రలు రాకపోవడంతో ఆమె మధ్యలో కొంతకాలం సినిమాలకి విరామం ఇచ్చింది.

 Senior Lady Comedian Srilakshmi Movie As A Main Lead-సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో మరల నటిగా రీఎంట్రీ ఇచ్చి బామ్మ పాత్రలు చేయడానికి ముందుకొస్తుంది.అయితే ఆమె రీఎంట్రీ తర్వాత ఒకప్పటి శ్రీలక్ష్మి హాస్యాన్ని గుర్తుచేసే స్థాయిలో పాత్రలు పడటం లేదని చెప్పాలి.

అయితే ఇప్పుడు ఆమె మెయిన్ లీడ్ లో ఒక సినిమా చేస్తుంది.సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో ఆమె టైటిల్ రోల్ లో నటిస్తుంది.ఇక ఆమెకి జోడీగా కేరింత ఫేం పార్వతీశం నటిస్తున్నాడు.చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఒక అరవై ఏళ్ల మహిళకి 25 ఏళ్ల యువకుడు భర్త ఎలా అయ్యాడనే కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథాశం సిద్ధం చేసుకున్నాడు.ఈ సినిమాతో నరేంద్ర నిర్మాతగా పరిచయం అవుతున్నాడు.

జంధ్యాల సినిమాలో ఆమె చేసిన పాత్రల తరహాలోనే ఇందులో కూడా శ్రీలక్ష్మి చేస్తున్న సావిత్రి పాత్ర ఉంటుందని తెలుస్తుంది.వినూత్న కథాంశంతో ఈ సినిమా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది.త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

మరి రీఎంట్రీలో హీరోయిన్ రేంజ్ పాత్రలో నటిస్తున్న శ్రీలక్ష్మికి ఈ సినిమా ఏ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.

#Parvathisham #Chaitanya Konda #SeniorLady

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు