మోదీ పై సంచలన వ్యాఖ్యలతో లేఖ.. ప్రముఖ రచయిత్రి విజ్ఞప్తి .. ?

భారత్ ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా అనే భారీ విపత్తును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఎవరి అసమర్ధత వల్ల అయితే నేమి తీవ్ర సంక్షోభంలో పడిపోతున్న దేశాన్ని ఒడ్డుకు చేర్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలనేది ప్రజల అభిప్రాయమట.

 Senior Journalist Arundhati Roy Letter For Modi Resignation As Prime Minister-TeluguStop.com

కానీ అవినీతికి దాసోహమైన నేతలు స్వార్ధంతో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నంత కాలం పరిస్దితుల్లో మార్పురాదు.

ఇకపోతే కేంద్రప్రభుత్వం పై ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ స్క్రోల్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌కు రాసిన లేఖలో విరుచుకుపడ్దారు.

 Senior Journalist Arundhati Roy Letter For Modi Resignation As Prime Minister-మోదీ పై సంచలన వ్యాఖ్యలతో లేఖ.. ప్రముఖ రచయిత్రి విజ్ఞప్తి .. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశంలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే ప్రస్తుతం ప్రభుత్వమన్నదే లేదని, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమకు అత్యవసరంగా ఓ ప్రభుత్వం కావాలని విజ్ఞప్తి చేశారు.అదీగాక దేశానికి సమర్ధుడైన నాయకుడు అవసరమని, కాబట్టి ప్రధాని మోదీ అత్యవసరంగా తన పదవి నుంచి పూర్తిగా కాకున్నా తాత్కాలికంగానైనా తప్పుకోవాలని ఆమె కోరారు.

ఇప్పుడు ప్రధాని కనుక తన పదవి నుంచి తప్పుకోకపోతే తమలో లక్షలాదిమంది అనవసరంగా చనిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ, మళ్లీ ఎన్నికలు వచ్చే 2024 వరకు వేచి ఉండలేమని, నేడు ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోతున్నారని అరుంధతీరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.మా ప్రధానిగా ఉండే నైతిక అర్హతను మీరు కోల్పోయారని వెల్లడించారు.

మరి ఈ లేఖ పై కేంద్రం స్పందన ఏంటో చూడాలి.

#Prime Minister #Arundhati Roy #PM Modi #Urges #PleaseGet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు