ఏపీ సర్కార్ కు మరో ఝలక్, మాజీ ఐపీఎస్ సస్పెన్షన్ ను ఎత్తేసిన హైకోర్టు  

Senior Ips Officer A B Venkateswara Rao Suspension - Telugu A B Venkateswara Rao, Ap High Court Lifts Suspension On Senior Ips Officer A.b. Venkateswara Rao, Chandrababu, Senior Ips Officer, Ys Jagan

ఏపీ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ సర్కార్ కు వరుసగా కోర్టు ల నుంచి ఝలక్ లు తగులుతున్నాయి.సర్కారీ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చెప్పాలి అంటూ తీసుకు వచ్చిన బిల్లును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Senior Ips Officer A B Venkateswara Rao Suspension

అయితే ఇప్పుడు తాజాగా మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బాధ్యతల గ‌ల ప‌దవిలో ఉండి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు మార్చిలో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయ‌న అక్రమాలకు పాల్పడినట్లు అప్ప‌ట్లో అభియోగాలు న‌మోదవ్వడం తో ఏపీ సర్కార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయ‌న అక్రమాలకు పాల్పడినట్లు అప్ప‌ట్లో అభియోగాలు న‌మోద‌వ్వడం తో డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ మేర‌కు స‌స్పెండ్ చేసిన‌ట్టు ఏపీ జగన్ ప్రభుత్వం వెల్ల‌డించింది.

ఏపీ సర్కార్ కు మరో ఝలక్, మాజీ ఐపీఎస్ సస్పెన్షన్ ను ఎత్తేసిన హైకోర్టు-Political-Telugu Tollywood Photo Image

అనంత‌రం స‌ర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయంచగా.తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని.తన 30 ఏళ్ల‌ స‌ర్వీసులో అవార్డులు సైతం వ‌చ్చాయ‌ని.ఒక్క ఆరోప‌ణ కూడా లేదని.

ప్ర‌భుత్వ‌మే త‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌రిస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు.అయితే క్యాట్ కూడా ఏపీ స‌ర్కార్ విధించిన సస్పెన్షన్‌ను సమర్థింస్తూ ఆయన సస్పెన్షన్ కరక్టే అని స్పష్టం చేయడం తో ఆయ‌న‌ హైకోర్టుకు వెళ్లారు.

దీనిపై విచార‌ణ చేసిన హైకోర్టు తాజాగా ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో కాస్త ఊర‌ట ల‌భించింది.క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ను పక్కన పెడుతూ ఆయ‌న‌ సస్పెన్షన్ చెల్లదని వెల్ల‌డించింది.

వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని స‌ర్కార్ ను ఆదేశించింది.సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌లో పెట్టిన‌ జీతభత్యాలను కూడా వెంటనే చెల్లించాలని ఆదేశించింది.మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫిర్యాదు మేరకు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.ఒకరకంగా జగన్ సర్కార్ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయానికి హైకోర్టు ఝలక్ ఇచ్చినట్లే అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Senior Ips Officer A B Venkateswara Rao Suspension Related Telugu News,Photos/Pics,Images..