సీనియర్ హీరోయిన్లు కుర్రహీరోలను పెళ్లి చేసుకోవడానికి అసలు సీక్రెట్ ఏంటంటే?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోలతో ప్రేమలో పడి డేటింగ్ లు చేసి ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.కుర్ర హీరోలు సైతం సీనియర్ హీరోయిన్స్ మాయలో పడుతున్నారు.

 Senior Heroines Are Marrying Young Heroes What Is The Reason Details, Katrina Ka-TeluguStop.com

అలా ఇరువురు ప్రేమలోపడి ఆ తరువాత సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.ఇటీవల డిసెంబర్ 9న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

38 ఏళ్ల కత్రినా కైఫ్ తన కంటే ఐదు ఏళ్ళు చిన్నవాడైన విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది.కేవలం విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మాత్రమే కాకుండా ఇలాంటి జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

అంతెందుకు టాలీవుడ్, బాలీవుడ్,హాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

అలాగే సుస్మితాసేన్ ఎంతోమంది కుర్రాళ్ళను ప్రేమలో పడేసిన ఆమె, మిస్ యూనివర్స్ గా కలల రాణిలా మారింది.

Telugu Arjun Kapoor, Bipasa Basu, Katrina Kaif, Mallika Arora, Nick Jonas, Priya

చివరికి తన కంటే పదిహేనేళ్లు చిన్నోడు అయిన మోడల్ రోహమాన్ షాల్ తో రిలేషన్ లో ఉంది.అలాగే బాలీవుడ్ నటి మల్లికా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ కి విడాకులు ఇచ్చిన తరువాత తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది.మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు.

Telugu Arjun Kapoor, Bipasa Basu, Katrina Kaif, Mallika Arora, Nick Jonas, Priya

బిపాసా బసు తనకంటే నాలుగేళ్ళు చిన్నవాడైన కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి ఏడు అడుగులు వేసింది.కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ, హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి జంటలు ఎన్నో ఉన్నాయి.ఇలా చాలామంది హీరోయిన్లు తన కంటే చిన్నవాడైన హీరోలను పెళ్లి చేసుకొని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube