ఎన్నో నెల గర్భమో తనకే తెలియదన్న సీనియర్ హీరోయిన్

సినిమా అంటేనే రకరకాల కల్పితాలు, ఊహాగానాలు, నిజం అనిపించే అబద్దాలు ఎన్నో ఉంటాయి.అయితే వాటన్నింటినీ ప్రేక్షకులు నిజం అనే భావిస్తారు.సేమ్ తన విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని వెల్లడించింది సీనియర్ నటీమణి శ్రుతి.1990లో తాను ఓ సినిమాలో నటిస్తున్న సందర్భంగా ఓ వింత అనుభవం ఎదురైనట్లు చెప్పింది.ఆ రోజుల్లో జనాలకు సినిమా షూటింగ్ గురించి పెద్దగా తెలియదు.అయితే తాను చేసిన సినిమాల షూటింగులు ఎక్కువగా పల్లెటూర్లలోనే జరిగినట్లు చెప్పారు.అయితే అప్పట్లో క్యారవాన్ ఉండేది కాదు.అందుకే బ్రేక్ టైంలో అరుగు మీదో, చెట్టుకిందో కూర్చునేదని చెప్పింది.

 Senior Heroine Sruthi About Her Pregnancy Details, Sruthi, Senior Actress Shrut-TeluguStop.com

తాను మొత్తంగా 120 సినిమాలు చేసినట్లు శ్రుతి వెల్లడించింది.ఈ సినిమాల్లో మొత్తం 100 మంది పిల్లల్ని కని ఉంటానని చెప్పింది.అప్పట్లో ఇదో రికార్డు అని చెప్పింది.అలాగే ఓ సినిమాలో తాను గర్భిణీగా యాక్ట్ చేసే సీన్ షూట్ చేస్తున్నట్లు చెప్పింది.

అప్పుడు తాను డమ్మీ కడుపుతో ఉన్నట్లు చెప్పింది.ఆ సమయంలో ఓ పెద్దావిడ తన దగ్గరికి వచ్చి.

ఏమ్మా నాన్న ఎవరు? అని అగినట్లు చెప్పింది.అప్పుడు తన వయసు 17 ఏండ్లు ఉంటాయని చెప్పింది.

తనుకు ఆమె ఏం అడిగిందో అర్థం కాలేదని చెప్పింది.మళ్లీ కొద్ది సేపటికి ఎన్నో నెల అని అడిగిందట.

Telugu Pregnancy Role, Pregnant Scene, Senioractress, Seniorshruthi, Shruthi, Sr

వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ ను అడిగి ఎన్నో నెల అని అడిగానని చెప్పింది.అయ్యో.నీకు ఎన్నో నెలో నీకే తెలియదా? అతడిని ఎందుకు అడగుతున్నావ్ అని కోప్పడిందట.

తన సమయంలో గర్భవతి సెంటిమెంట్ సీన్ అని చెప్పింది.

వర్షం పడే సమయంలో గర్భవతి గురించి ఏడూస్తూ ఉండే సీన్ ఓ ట్రెండ్ అని వెల్లడించింది.అందుకే పలు సినిమాల్లో తాను ఆ సీన్లు చేసినట్లు వెల్లడించింది.

తన గర్భం కోసం ప్రత్యేకంగా మూడు రకాల స్పాంజిలు వాడేదని చెప్పింది.తనకు స్పాంజిలు పెట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తి ఉండేదని వెల్లడించింది శ్రుతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube