తన భర్తని పరిచయం చేసిన సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్  

తన భర్తని సోషల్ మీడియాలో పరిచయం చేసిన శ్రియ శరన్ .

Senior Heroine Shriya Introduced Her Husband For Media-

టాలీవుడ్ లో దశాబ్దం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి, స్టార్ హీరోలందరితో జోడీ కట్టిన హాట్ బ్యూటీ శ్రియ శరన్.సౌత్ లో హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన శ్రియ శరన్ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గా మారిపోవడంతో సినిమాలు చాలా వరకు తగ్గిపోయాయి.ఇక ఈ టైంలో శ్రియ ఊహించని విధంగా ఆండ్రీ అనే ఒక బిజినెస్ మ్యాన్ కమ్ రష్యన్ టెన్నిస్ ప్లేయర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలెట్టింది..

Senior Heroine Shriya Introduced Her Husband For Media--Senior Heroine Shriya Introduced Her Husband For Media-

ఇక అడపా దడపా సినిమాలు చేస్తున్న కూడా ఎక్కువగా తన అత్తారింటిలోనే ఉంటున్న శ్రియ విదేశాలలో సెటిల్ అయిపోయింది అని చెప్పాలి.ఇదిలా ఉంటే శ్రియ శరన్ పెళ్లి తర్వాత ఇప్పటి వరకు తన భర్త ఫోటోలని ఎవరికి షేర్ చేయలేదు.అయితే తన రష్యన్ భర్తతో ఇప్పుడు హాలిడే టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ సీనియర్ భామ తన భర్తతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి, తనతో తాను ఎంత హ్యాపీగా ఉన్నది తెలియజేసింది.

ఇక శ్రియ తన భర్త ఆండ్రూతో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.తెలుగులో శ్రియ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.ఇక తమిళంలో ఓ రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్న కూడా శ్రియ ఇప్పుడు సినిమా లైఫ్ కంటే ఫ్యామిలీ లైఫ్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ఫోటోలు చూస్తూ ఉంటే కనిపిస్తుంది.