హీరోయిన్ హన్సిక బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా..?

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న హన్సిక స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం పొందలేకపోయారు.తెలుగులో హన్సిక ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి.

 Senior Heroine Hansika Revealed Her Beauty Secret Details Here, Beauty Secret De-TeluguStop.com

పాల బుగ్గలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న హన్సిక తాజాగా తన బ్యూటీ సీక్రెట్ ను చెప్పారు.

చిన్న వయస్సులోనే నటిగా ఎదిగిన హన్సిక తనకు టిఫిన్లలో ఇడ్లీ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు.

అమ్మ ఏ టిఫిన్ చేసినా తనకు ఇడ్లీ మాత్రమే కావాలని చెప్పేదానినని తాను ఎక్కువగా ఇడ్లీని తినడం వల్ల కొంతమంది తనను ఇడ్లీ బుగ్గల పిల్లా అని టీజ్ చేసేవారని హన్సిక చెప్పుకొచ్చారు.తను అందంగా కనిపించడానికి ఇడ్లీనే కారణమే ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే అప్పటికీ ఇప్పటికీ తాను మారానని హన్సిక అన్నారు.

Telugu Secret, Deshamuduru, Hansika, Hansika Offers, Idli, Kollywood, Tamil Fans

ప్రస్తుతం తాను ఈ టిఫిన్ ఆ టిఫిన్ అనే తేడాల్లేకుండా అన్ని రకాల టిఫిన్స్ ను తింటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.తెలుగుతో పాటు హన్సిక ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.అయితే ఈ హీరోయిన్ కు ఈ మధ్య కాలంలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదు.

సోషల్ మీడియాలో మాత్రం హన్సిక యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను, ఇతర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

Telugu Secret, Deshamuduru, Hansika, Hansika Offers, Idli, Kollywood, Tamil Fans

తమిళనాడు ప్రేక్షకులు హన్సిక కోసం ఏకంగా గుడి కట్టి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం.గతేడాది హన్సికకు పెద్దగా కలిసిరాలేదు.హన్సిక ఈ ఏడాదైనా వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

హన్సిక నటిగా వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube