నా దృష్టిలో వాళ్ళే గొప్ప దర్శకులంటున్న సీనియర్ హీరో...  

Senior Hero Suman Sensational Comments On Directors - Telugu Suman Comments On Directors, Suman Latest Movie News, Suman Latest News, Suman Movie News, Suman News, Tollywood Seniour Hero Suman

తెలుగు, తమిళ్, కన్నడ, తదితర సినీ పరిశ్రమల్లో తనకంటూ కొద్దిపాటి మంది అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో సుమన్ ఒకరు.పాత్ర ఏదైనప్పటికీ సునాయాసంగా ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సుమన్ మంచి దిట్ట.

Senior Hero Suman Sensational Comments On Directors

అయితే ఒకప్పుడు సుమన్ టాలీవుడ్ స్టార్ హీరోలకు గట్టిపోటీని ఇచ్చారు.అయితే ఆ మధ్య కాలంలో తన వ్యక్తిగత సమస్యలు కారణంగా కొద్దిరోజులు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ప్పటికీ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి బాగానే రాణిస్తున్నారు.

అయితే తాజాగా సుమన్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా దర్శకుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులతో కానీ, హీరోలతో గాని, హీరోయిన్లతో కానీ హిట్ ఎవరైనా కొడతారని అన్నారు.కానీ ఎటువంటి స్టార్ ఇమేజ్ లేని నూతన నటీనటులతో హిట్ కొట్టే దర్శకులే నిజమైన హీరోలని అన్నారు.

అంతేగాక వాళ్లంటే తనకు అమితమైన అభిమానం అని కూడా అన్నారు.ఎందుకంటే నటన పరంగా ఎటువంటి అనుభవం లేనటువంటి ఆర్టిస్టులతో పనిచేయడం అంటే కత్తి మీద సాము వంటిదే అలాంటిది ఆర్థికంగా, నటన పరంగా అన్ని మేనేజ్ చేసుకుంటూ ఒక సినిమాని తీయడం అంత ఈజీ కాదని అన్నారు.

అంతేకాక టాలీవుడ్ లో కూడా అప్పట్లో దాసరి నారాయణరావు, దర్శకుడు శేఖర్ కమ్ముల లాంటి వారు కొత్త నటీనటులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ హిట్ కొట్టిన వారే అని చెప్పుకొచ్చారు.అంతేగాక తను కూడా ఎవరైనా కొత్త దర్శకులతో సినిమా అంటే తనకి తగ్గట్టు పాత్ర ఉంటే కచ్చితంగా నటిస్తానని అందులో ఎటువంటి మొహమాటం లేదని అన్నారు.

తాజా వార్తలు

Senior Hero Suman Sensational Comments On Directors-suman Latest Movie News,suman Latest News,suman Movie News,suman News,tollywood Seniour Hero Suman Related....