చిరంజీవి, సుమన్ మధ్య గొడవలు.. అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో టాప్ హీరో గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు సుమన్.

 Senior Hero Suman Reaction On Clash With Chiranjeevi , Suman , Chiranjevi , Clas-TeluguStop.com

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా కష్టపడి సినిమా అవకాశాలు అందుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ లో ఎదిగాడు.

అలా అప్పట్లో టాప్ హీరో చిరంజీవి కి సమానంగా నిలుస్తూ చిరంజీవికి పోటీగా ఎన్నో సినిమాలలో నటించారు.

ఈ నేపథ్యంలోనే సుమన్, చిరంజీవి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు కూడా వినిపించాయి.

ఇక ఇదే విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు సుమన్.ఇక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోల తరువాత నెక్స్ట్ బ్యాచ్ నేను, చిరంజీవి అని తెలిపారు సుమన్.ఆ తరువాత ఇండ్రస్టీకి వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వచ్చారు అని తెలిపారు.

ఆ సమయంలో తనకు చిరంజీవికి మధ్య ఎక్కువగా పోటీ ఉండేది అని తెలిపారు.ఇక హీరోగా ఎవరికి వారి ప్రత్యేకమైన కాంపౌండ్ ఉండేది అని, రెండు గ్రూప్స్ ఉండేవని తెలిపారు.

Telugu Chiranjevi, Clash, Krishna, Krishna Raju, Nagarjuna, Nageswara Rao, Rama

ఇక ఆ సమయంలో చిరంజీవి గారికి రావలసిన కొన్ని సినిమాలు మీకు రావడంతో మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అంట కదా అని సదరు ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.ఆ విషయంపై సుమన్ స్పందిస్తూ.అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ ఖండించారు.ఆ సమయంలో చిరంజీవికి పిక్స్డ్ బ్యానర్స్ ఉండేవని అది ఒక బ్యాచ్ అని తెలిపారు సుమన్.ఇక ఈ ఇంటర్వ్యూలో చిరంజీవికి తనకు మధ్య ఎటువంటి విభేదాలు గొడవలు లేవు అని అవన్నీ రూమర్స్ మాత్రమే అని సుమన్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube