రాజశేఖర్ ప్రమాద ఘటనపై విచారించిన అధికారులు,లైసెన్స్ రద్దుకు చర్యలు

ఇటీవల యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరున్న సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు లో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడడం తో కారు నుజ్జు నుజ్జు ఆయిన విషయం విదితమే.

 Senior Hero Rajasekhar Driving Licence Cancelled-TeluguStop.com

అయితే ఈ ప్రమాదంలో రాజశేఖర్ మాత్రం స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ గలిగారు.అయితే ప్రమాద ఘటనపై విచారణ జరిపిన పోలీసులు చర్యలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తుంది.

ఆయన 21 సార్లు తన కారులో అతి వేగం తో ప్రయాణించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన అధికారులు దీనికి తగినట్లు గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఆయన కారు నడిపే విషయంలో పరిమితికి మించిన వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

నవంబర్‌ 12 అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్‌ కారు బోల్తా పడింది.రాజశేఖర్‌ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరుగగా, ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం తో ఆయన పెను ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారు.

Telugu Rajasekhar, Rajashekar Car-

రాజశేఖర్‌ డ్రైవింగ్‌ చాలా రాష్‌గా ఉంటుందంటున్నారు తెలిసిన వాళ్లు.దానికి తోడు ఇటీవల ప్రమాదానికి గురైన కారుపై గతంలో మూడు పెండింగ్‌ చలాన్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ మూడు చలాన్లు కూడా అతి వేగం, ప్రమాదకర డ్రైవింగ్‌కు సంబంధించినవే కావడం తో అధికారులు ఇలా ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.మరి అధికారులు ఈ నిర్ణయం పై యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube