అమల నాగార్జున క్యూట్ లవ్ స్టోరీ మీకు తెలుసా..?

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున, అమల 1992 సంవత్సరం జులై 11న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఒకరినొకరు ఇష్టపడి అమల, నాగార్జున పెళ్లి చేసుకున్నారు.

 Senior Hero Nagarjuna And Heroine Amala Cute Love Story Details Here, Akhil, Ama-TeluguStop.com

అయితే వీళ్ల లవ్ స్టోరీ చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.విక్రమ్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నాగార్జున భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా సత్తా చాటారు.

ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే రియాలిటీ షో హోస్ట్ గా బిజినెస్ మేన్ గా సత్తా చాటుతున్నారు.

తొలి సినిమాతోనే లుక్ పరంగా తనలో మంచి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్న నాగార్జున శివ సినిమాతో తన రేంజ్ ఏమిటో ప్రూవ్ చేశారు.

నాగార్జున మొదట వెంకటేష్ సోదరి లక్ష్మీని పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల వల్ల లక్ష్మీ నాగార్జున విడిపోయారు.నాగార్జున లక్ష్మీల సంతానం నాగచైతన్య.ఆ తరువాత నాగార్జున, అమల కలిసి నాలుగు సినిమాల్లో నటించగా ఒక సినిమా షూటింగ్ సమయంలోనే నాగార్జున అమలను ఇష్టపడ్డారు.

1986 సంవత్సరంలో కోలీవుడ్ మూవీతో అమల కెరీర్ ను మొదలుపెట్టి నాగార్జునతో వివాహం తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పారు.

Telugu Akhi, Amala, Chennai, Naga Chaitanya, Nagarjunaamala, Nagarjunacute, Naga

ఒక సినిమా షూటింగ్ సమయంలో అమల వేసుకునే క్యాస్టూమ్స్ ఇబ్బందికరంగా ఉంటే నాగార్జున దర్శకునికి చెప్పి మార్పించారు.ఆ తరువాత అమలను ఇష్టపడుతున్నానని తెలిసిన నాగార్జున అమెరికాలో షూటింగ్ లో ఉన్న అమలను కలిసి తన ప్రేమ విషయం వెల్లడించారు.

అమలకు కూడా నాగార్జునపై సదభిప్రాయం ఉండటంతో అమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

Telugu Akhi, Amala, Chennai, Naga Chaitanya, Nagarjunaamala, Nagarjunacute, Naga

ఆ తరువాత చెన్నైలో అమల నాగార్జునల వివాహం ఘనంగా జరిగింది.నాగార్జున అమల సంతానం అఖిల్ కాగా అఖిల్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ హిట్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube