కొత్త వ్యాపారంలోకి జగపతిబాబు ఎంట్రీ.. ఏ బిజినెస్ అంటే..?

ఒకప్పుడు ఫ్యామిలీ కథలలో ఎక్కువగా నటించి హీరోగా జగపతిబాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రల్లో, స్పెషల్ రోల్స్ లో నటిస్తున్న జగపతిబాబు ఆ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పిస్తున్నారు.

 Senior Hero Jagapatibabu Started New Ayurveda Hospital-TeluguStop.com

అయితే జగపతిబాబు కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో ఆనందయ్య మందు గురించి జగపతిబాబు పాజిటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న జగపతి బాబు త్వరలో ఒక ఆయుర్వేద ఆస్పత్రిని ప్రారంభించనున్నారని సమాచారం.జూబ్లీహిల్స్ లో ఇతరుల భాగస్వామ్యంతో జగపతిబాబు ఈ ఆస్పత్రిని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

 Senior Hero Jagapatibabu Started New Ayurveda Hospital-కొత్త వ్యాపారంలోకి జగపతిబాబు ఎంట్రీ.. ఏ బిజినెస్ అంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఆయుర్వేద ఆస్పత్రికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని సమాచారం.జగపతిబాబు స్వయంగా ఆస్పత్రి రెనోవేషన్ పనులను చూసుకుంటున్నారని తెలుస్తోంది.

ఆస్పత్రికి జగపతిబాబు కూడా ఒక డైరెక్టర్ గా వ్యవహరించనున్నారని సమాచారం.అయితే జగపతిబాబు అకస్మాత్తుగా ఆయుర్వేద ఆస్పత్రిని ప్రారంభించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఒకప్పుడు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతిబాబుకు ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.ఒక దశలో జగపతిబాబు సినిమాలపరంగా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొత్త ఆస్పత్రిని ప్రారంభించనున్న జగపతిబాబు ఈ వ్యాపారంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.తెలుగులో జగపతిబాబు చేతిలో సినిమా ఆఫర్లు బాగానే ఉన్నాయి.

జగపతిబాబు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారని సమాచారం.సెకండ్ ఇన్నింగ్స్ లో లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో సినిమాలు జగపతిబాబుకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకవైపు క్లాస్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు మాస్ రోల్స్ లో కూడా జగపతిబాబు నటిస్తూ ఉండటం గమనార్హం.

#JagapathiBabu #New Business #JagapathiBabu #JagapathiBabu #SeniorHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు