మళ్లీ అలిగిన సీనియర్లు .. రేవంత్ అవకాశం ఇస్తే... ?

అలకలు ఆగ్రహాలు తెలంగాణ కాంగ్రెస్ లో నిత్యకృత్యం అయిపోయాయి.ఏ చిన్న అవకాశం దొరికినా, తమ ప్రతాపం చూపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధమైపోతూ ఉంటారు.

 Telangana Congress Senior Leaders Are Not Happy With The Revanth Reddy Meeting,-TeluguStop.com

ఎప్పుడూ ఇక్కడ ఆధిపత్య పోరు  నడుస్తూనే ఉంటుంది.ఎవరికి వారే తామె సీనియర్ నాయకులు అన్న ఫీలింగ్ లో ఉంటూ,  పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించడం వంటి వ్యవహారాలు ఎప్పటి నుంచో తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటూనే వస్తున్నాయి.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి సీనియర్ నాయకులు ఆయనపై గుర్రు గానే ఉంటూ, అవకాశం దొరికితే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ఉద్యమాలు చేస్తున్న వామపక్ష పార్టీలతో అఖిలపక్షం సమావేశం తరహాలో ఒక సమావేశాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు, పోడు భూముల అంశంపైన ఆందోళనకు దిగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశాన్ని గాంధీభవన్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా భారత్ బంద్ తో పాటు ,పోడు భూములు సమస్యలపైన ఉద్యమాలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ సమావేశానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వలేదంటూ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అఖిలపక్షం పేరుతో నిర్వహించిన సమావేశానికి సీనియర్ నాయకులు అయిన తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని, ఈ సమావేశాన్ని గాంధీ భవన్లో నిర్వహించిన నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వాల్సిందేనని సీనియర్ నాయకులు కొంతమంది ఆగ్రహంగా ఉండడంతోపాటు , దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ కు ఫిర్యాదు చేశారు.
 

Telugu Aicc, Congress, Gandhi Bhavan, Githa, Manikyam Tagore, Pcc, Rahul Gandhi,

ముఖ్యంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గీతారెడ్డి, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఈ విషయంలో తీవ్రంగా నొచ్చుకున్నారట.పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టారు.భారీ స్థాయిలో సభలు సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ కేడర్ లో ఉత్సాహం కలిగిస్తూనే సీనియర్ నాయకులను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో సీనియర్ల వ్యవహారం రేవంత్ కు తలనొప్పి గా మారింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube