తను తినడానికి తెచ్చుకొనేవి అన్నీ బాలయ్య అతనికి పెట్టేవాడట.. కారణం?

తెలుగు సినీ పరిశ్రమలో ది బెస్ట్ కో- డైరెక్టర్స్ లో ఒకరైన… GK చౌదరి.ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గురించి పలు కామెంట్స్ చేశారు.

 Senior Co Director G K Chowdary About Balayya Gk-TeluguStop.com

టాలీవుడ్ లో ఎంతో సేవ చేసిన ఆయనకు సరైన గౌరవం ఇవ్వట్లేదని ఆయన వాపోయరు.తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడానికి ముఖ్య కారణమైన దాసరికి అటు ఇండస్ట్రీ గానీ, ప్రభుత్వాలు గానీ తగిన గుర్తింపును ఇవ్వట్లేదని ఆయన అన్నారు.

అంతే కాకుండా దాసరి చేసిన కృషికి ఆనవాలుగా కనీసం ఒక విగ్రహాన్ని కూడా పెట్టలేదని.తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులను విమర్శించారు.

 Senior Co Director G K Chowdary About Balayya Gk-తను తినడానికి తెచ్చుకొనేవి అన్నీ బాలయ్య అతనికి పెట్టేవాడట.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


డైరెక్టర్ అంటే సినిమాపై ప్యాషన్, చచ్చేంత ఇష్టం ఉండాలని GK చౌదరి తెలిపారు.చాలా మంది డైరెక్టర్ అంటే కోట్లు సంపాదించొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేరని ఆయన అన్నారు.తనకు నచ్చిన డైరెక్టర్స్ లో ముఖ్యంగా ఆయన గురువుగారైన దాసరి నారాయణరావు అంటే తనకు చాలా ఇష్టం అని ఆ తర్వాత రాఘవేందర్ రావు అని చెప్పారు.దాసరి అంటే గ్లామర్.

రాఘవేందర్ రావు అంటే గ్లామర్ అని … అంతేకాకుండా వారిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని చౌదరి ప్రశంసించారు.ఇప్పుడున్న దర్శకుల్లో సెల్వ రాఘవన్ అంటే అమితమైన గౌరవమని ఆయన తెలిపారు.

సెల్వ గారి డెడికేషన్, సినిమాపై అయకున్న ఇష్టం ఈరోజు స్థాయిలో నిలబెట్టింది అని ఆయన చెప్పుకొచ్చారు.

డైరెక్షన్ విభాగంలో నేపోటిజం అనేది లేదని… అది కేవలం టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.కథను ఎవరు బాగా చెప్తారో.వాళ్ళకి మంచి ఛాన్స్ లు కూడా అంతే త్వరగా వస్తాయని చౌదరి తెలిపారు.

తాను పని చేసిన ఆర్టిస్ట్ ల్లో… కమెడియన్ అలీ ఎక్స్ ట్రాడ్రినర్ పర్సన్ అని ఆయన మెచ్చుకున్నారు.అలాగే నచ్చిన నటుల్లో బాలయ్య బాబు అంటే ఇష్టమని తెలిపారు.

బాలకృష్ణ అనగానే కోపంగా ఉంటారు.కొడతారని అనుకుంటారు గానీ.

ఆయనది మంచి క్యారెక్టర్ అని చౌదరి అన్నారు.బాలయ్యతో పరమవీరచక్ర సినిమా షూటింగ్ లో ఆయన అంటే ఏంటో తెలిసిందని అన్నారు.

చెప్పిన టైం కంటే ముందే వచ్చి కూర్చునే వారని.చాలా నెమ్మదిగా ఉండేవారని… చౌదరి అన్నారు.

బాలకృష్ణ తన తినడానికి తెచ్చుకున్న అవన్నీ తను కూడా పెట్టేవారని తెలిపారు.బాలయ్యతో పాటు మోహన్ బాబు గారు కూడా టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని ఆయన అన్నారు.

#Raghavendra Rao #Dasari Yana Rao #GKChowdary #SeniorGK #Chowdary

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు