ట్రక్కు 'డ్రైవర్'గా మారిన సినీ నటి.. ఎవరంటే?

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే.ఇక రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ విధించింది.

 Senior Actress Turns To Truck Driver Truck Driver, Actress Turns, Corona , Keral-TeluguStop.com

దీంతో అన్ని రంగాలు, పరిశ్రమలు మూతపడటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఇక ఈ నేపథ్యంలో ఎందరో కూలీల పరిస్థితులు దారుణం గా మారాయి.

పూటకి గడవని పరిస్థితిలో ఉన్నారు.అంతేకాకుండా కొందరు ఉద్యోగస్తులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

వీళ్లే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళలో కూడా కొందరు బయట పనులు చూసుకుంటున్నారు.

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటులకు ఇటువంటి పరిస్థితి రాదని తెలుసు.

కానీ ఓ సినీ నటి మాత్రం ఆర్థికంగా తనకు ఇబ్బందులు ఉండటం తో ఏకంగా ట్రక్కు డ్రైవర్ గా మారింది.ఇంతకీ ఆ నటి ఎవరంటే కేరళకు చెందిన మలయాళ నటి కార్తీక.

ఆమె కొన్ని మలయాళ సినిమాలలో నటించింది.ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు వాయిదా పడటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్తీక డ్రైవింగ్ చేస్తూ జీవనాన్ని గడుపుకోవాలనుకుంది.

Telugu Actress Turns, Corona, Kerala, Truck-Movie

ఇక తానే సొంతంగా ఒక ట్రక్కు కొనుక్కుంది.కేరళలో పైనాపిల్, కొబ్బరి బోండాలు వంటివి తక్కువ ధరకు దొరికే ప్రాంతం నుండి మంచి గిట్టుబాటు ధర పలికే ప్రాంతాలకు తరలిస్తుంది.దీంతో ఆమె ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటో వైరల్ గా మారింది.టీ షర్ట్ వేసుకొని ట్రక్కు నడుపుతున్న సమయంలో పోలీసులు తన ట్రక్కు కు ఎదురవడంతో తాను సినీ నటి అని గుర్తుపట్టారు.ఇక తనను వాళ్లు ప్రశ్నించగా ఖాళీగా ఉన్న సమయంలో ఆదాయం కోసం ఏదో ఒకటి చేయాలని డ్రైవర్ గా మారాను అని తెలిపింది.

ఇది చూసిన నెటిజనులు ఆమె పట్టుదల చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube