నేను అలా చేసుంటే ఉదయ్ కిరణ్ బ్రతుకుండేవాడేమో అంటున్న సీనియర్ నటి...

తెలుగు చిత్రాల్లో అక్క, అమ్మ, చెల్లి, వదిన వంటి  పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి సుధ గురించి తెలియని వారుండరు.ఈమె పాత్రలకి బాగా కనెక్ట్ అయినటువంటి ప్రేక్షకులు సుధని కొంతమంది తమ ఇంట్లో మనిషి లాగా చూస్తారు.

 Senior Actress Sudha, Tollywood, Uday Kiran, Death News, Sudha Emotional About D-TeluguStop.com

అయితే తాజాగా సుధ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తన జీవితంలో కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ఉదయ్ కిరణ్ తనతో చాలా చనువుగా ఉండేవాడని అంతేగాక అప్పుడప్పుడు ఉదయ్ కిరణ్ తనతో మిమ్మల్ని చూస్తే మా అమ్మ లాగా అనిపిస్తుందని అందువల్ల తనతో తనకి సంబంధించినటువంటి అన్ని విషయాలను చెప్పుకునేవాడని తెలిపింది.ఒకానొక సమయంలో ఉదయ్ కిరణ్ ని దత్తత కూడా తీసుకోవాలని అనుకున్నానని, కానీ ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఎమోషనల్ అయింది.

ఒకవేళ ఉదయ్ కిరణ్ ని తాను దత్తత తీసుకుని ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకోనిచ్చే దానిని కాదని తెలిపింది.

అలాగే సినీ పరిశ్రమలో తాను దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాల్లో ఆర్టిస్టుగా పనిచేశానని కూడా తెలిపింది.

ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యానని అందువల్ల సినిమాలకు కొంత తక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని చెప్పు కొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube