నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే..?

పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి తెలుగులో నటిగా కవిత గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న కవిత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

 Senior Actress Kavitha Son Succumbs Corona Virus-TeluguStop.com

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు మృతి చెందిన సంగతి తెలిసిందే.చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా బారిన పడి కవిత కొడుకు కన్నుమూశారు.

 Senior Actress Kavitha Son Succumbs Corona Virus-నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా వైరస్ కవిత ఇంట్లో శోకాన్ని మిగల్చటం గమనార్హం.

కవిత కొడుకు సంజయ్ రూప్ కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకోలేక మృతి చెందారు.మరోవైపు కవిత భర్త దశరథరాజు కూడా కరోనా బారిన పడ్డారు.

ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కవిత కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం గురించి తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Telugu Actor Kavitha Son Sanjay Roop, Character Artist Kavitha, Corona Cases, Corona Second Wave, Corona Virus, Kavitha, Kavitha Son Died, Sanjay Roop, Senior Actress, Tollywood-Movie

11 సంవత్సరాల వయస్సులోనే ఓ మజ్ను అనే సినిమాతో కవిత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.దాదాపు 50కు పైగా సినిమాలలో కవిత నటించారు.తెలుగుతో పాటు మలయాళ, కన్నడ భాషల సినిమాల్లో సైతం కవిత నటించడం గమనార్హం.హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన తరువాత కవిత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.

కరోనా వల్ల ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Telugu Actor Kavitha Son Sanjay Roop, Character Artist Kavitha, Corona Cases, Corona Second Wave, Corona Virus, Kavitha, Kavitha Son Died, Sanjay Roop, Senior Actress, Tollywood-Movie

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకే ప్రమాదమని వాళ్లు చెబుతుండటం గమనార్హం.కరోనా కేసులు తగ్గినా మాస్క్ ధరిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.

#Kavitha #Corona Virus #CharacterArtist #ActorKavitha #Senior Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు