నిర్మాతలే హీరోయిన్స్ ని గోకుతారు! సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సీనియర్ నటి కవిత.ఈమె అప్పుడప్పుడు రాజకీయాలలో, అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది.

 Senior Actress Kavita Sensational Comments-TeluguStop.com

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదని అనేకంటే అవకాశాలు రావడం లేదని చెప్పాలి.అయితే తాజాగా ఈమె ఓ యుట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం లేదని, దర్శకులు కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని అన్నారు.ఈ కారణంగానే చాలా మంది హీరోయిన్స్ రోడ్డెక్కి అవకాశాల కోసం ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తనలాంటి సీనియర్ నటీమణులకి కూడా తెలుగులో ప్రాధాన్యత దొరకడం లేదని, తమిళంలో వస్తున్నా అవకాశాలు ఇక్కడ రావడం లేదని చెప్పింది.

అలాగే ఒకప్పుడు ఆర్టిస్ట్ లు అందరూ ఒకే చోట కూర్చొని సినిమాలో సీన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదని, చిన్న నటులు కూడా క్యారవ్యాన్ లో కూర్చొని సీన్ పేపర్ అక్కడికే తెమ్మని చెబుతున్నారని విమర్శించారు.

ఈ కారణంగానే సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యి నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు.అలాగే ఇండస్ట్రీలో హీరోయిన్స్ మీద ఇప్పటికి చులకన భావం ఉందని నిర్మాతలే డబ్బు పెట్టాం కదా హీరోయిన్ గోకిన తప్పిన లేదు అని వీపుల మీద చేతులు వేస్తూ ఉంటారని, వాళ్ళే అలా చేస్తే మిగిలిన వారు ఎందుకు వేధించరని అంటుంది.

ఇలా ఇండస్ట్రీలో భాగోతాలు, బాధలు అన్ని ఏకరవు పెట్టిన కవిత తన చేయాలనుకున్న అన్ని విమర్శలు నేరుగా చేసేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube