హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదంటున్న సీనియర్ నటి...

తెలుగులో ఒకప్పుడు అక్క, అమ్మ, చెల్లెలు ఇలాంటి పాత్రలు అంటే అందరికీ ముందుగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గుర్తొస్తుంది.ఈమె నటించినటువంటి పాత్రలకి బాగా కనెక్ట్ అయినటువంటి కొందరు అన్నపూర్ణమ్మ ని తమ ఇంట్లో మనిషిగా చూస్తుంటారు.

 Senior Actress Annapurna Interesting News-TeluguStop.com

అయితే అందుకు తగ్గట్టుగానే అన్నపూర్ణమ్మ కూడా సెంటిమెంట్స్, ఎమోషన్స్ బాగా పండించి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.అయితే తన సినీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి దాదాపుగా వందలకి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

అయితే తాజాగా నటి అన్నపూర్ణమ్మ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు పంచుకుంది.ప్రస్తుతం తాను “అన్నపూర్ణమ్మ గారి మనవడు” అనే చిత్రంలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నర్రా నాగేశ్వరరావు దర్శకత్వం వహించారని అన్నారు.

అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తాను హీరోయిన్  అవుదామనే వచ్చానని కానీ ఎందుకో హీరోయిన్ పాత్రలో నటించడం తనకు నచ్చలేదని అందుకే కావాలనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారని అన్నారు.ఇందులో భాగంగా మన నిజ జీవితంలో ఎంతో ఆప్యాయంగా పలకరించేటువంటి వారి పాత్రల్లో నటిస్తూ బాగానే ఎంజాయ్ చేశానని అన్నారు.

Telugu Annapurna-Movie

అప్పటి తరం నటీమణుల్లో చాలామంది ఇప్పుడు రిటైర్డ్ అయి విశ్రాంతి తీసుకుంటున్నారు.కానీ నటి అన్నపూర్ణ మాత్రం ఇప్పటికి తెరపై ఏదో ఒక చిత్రంలో అమ్మ గానో, అమ్మమ్మ గానో, ఇలా ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube