నా కూతురు చనిపోవడానికి కారణమిదే.. అన్నపూర్ణ కీలక వ్యాఖ్యలు?

దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి నటిగా అన్నపూర్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈమె ఒరిజినిల్ నేమ్ ఉమా మహేశ్వరి కాగా 13 సంవత్సరాల వయస్సులోనే నాటకాలు వేయడం ద్వారా అన్నపూర్ణ కెరీర్ ను మొదలుపెట్టారు.

 Senior Actress Annapurna Comments About Daughter Suicide, Acresses Comments, Ann-TeluguStop.com

పలు సినిమాల్లో అన్నపూర్ణ హీరోయిన్ గా కూడా నటించడం గమనార్హం.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నపూర్ణ కూతురు మృతి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆడపిల్ల అందంగా ఉంటుందని అందువల్ల పాపను దత్తత తీసుకున్నానని చెప్పారు.కూతురుకు చదువు ఎక్కలేదని కూతురును పెంచుకున్నా చనిపోవడంతో ప్రయోజనం లేకపోయిందని అన్నపూర్ణ అన్నారు.ఆయుష్షును, అదృష్టాన్ని పట్టలేమని కూతురు ఆత్మహత్య గురించి అన్నపూర్ణ స్పందించారు. యంగర్స్ కు విచక్షణా జ్ఞానం తక్కువగా ఉంటుందని అన్నపూర్ణమ్మ వెల్లడించారు.

నా కూతురు చేయగలిగినవి అన్నీ చేశానని అన్నపూర్ణ అన్నారు.

కూతురును సినిమాల్లోకి తీసుకురావాలని మాత్రం తాను అనుకోలేదని అన్నపూర్ణ అన్నారు.

కూతురును డాక్టర్ లేదా సివిల్ ఇంజనీర్ ను చేయాలని అనుకున్నామని అన్నపూర్ణ పేర్కొన్నారు.కూతురుకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేశానని అన్నపూర్ణ అన్నారు.

నాకు ప్రేమ కొంచెం తక్కువని అన్నపూర్ణ తెలిపారు.విపరీతమైన ప్రేమలు తక్కువని తాను బాధ్యతను నమ్ముతానని అన్నపూర్ణ పేర్కొన్నారు.

Telugu Actress, Anna Purna-Movie

కొంతమంది చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తారని అలా తాను నటించనని అన్నపూర్ణ చెప్పారు.కూతురు భర్త మంచివారేనని కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తనకు తెలియదని అన్నపూర్ణ వెల్లడించారు.కూతురు కష్టాలు చెబితే వినకుండా ఎందుకు ఉంటానని అన్నపూర్ణ అన్నారు.కుతురుకు కోపం ఎక్కువని అన్నపూర్ణ వెల్లడించారు.తన కూతురుకు ఒక పాప ఉందని ఆ పాపను అల్లుడి కుటుంబ సభ్యులు పెంచుకుంటున్నారని అన్నపూర్ణ చెప్పారు.తన కూతురుకు ఆయుష్షు అంతవరకే ఉందని అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube