క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..?

సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది.కొంతమంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని చెబుతుంటే మరి కొంతమంది మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెబుతున్నారు.

 Senior Actress Annapoorna Sensational Comments About Casting Couch, Senoir Actre-TeluguStop.com

అయితే టాలీవుడ్ సీనియర్ నటీమణులలో ఒకరైన అన్నపూర్ణ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలో అన్నపూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి మాట్లాడుతూ తప్పు ఎప్పుడూ ఒకరి వైపే ఉంటుందని అనుకోవద్దని.

తప్పులు అనేవి ఇద్దరికీ ఇష్టమైతే మాత్రమే జరుగుతాయని ఆమె వెల్లడించారు.

తాను నాటకాలలో నటించి అక్కడినుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చానని.

తన ఒరిజినల్ నేమ్ ఉమ కాగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ పేరును అన్నపూర్ణగా మార్చుకున్నానని ఆమె తెలిపారు.తాను నటించిన సినిమాలలో నటీనటులంతా తనను ఎంతగానో గౌరవించారని ఆమె చెప్పారు.

ప్రతి రంగంలోనూ మహిళలు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొంటారని క్యాస్టింగ్ కౌచ్ అనేది అదనపు వ్యవహారమని అన్నపుర్ణ వెల్లడించారు.

Telugu Couach, Senoiractresss, Tollywood, Varun Tej, Venkatesh-Movie

ఇతర రంగాలలో మహిళలు ఏ విధంగా క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకుంటారో సినిమా రంగంలో కూడా అదే విధంగా తప్పించుకోవాలని అన్నపూర్ణ పేర్కొన్నారు.మూవీ ఆఫర్ల కోసం ట్రై చేసేవాళ్లకు కష్టాలు ఉంటాయని.ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె సూచనలు చేశారు.

గతంలో శ్రీరెడ్డితో పాటు కొంతమంది నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.స్టార్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు మాత్రం సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube