బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట   Senior Actress Jamuna Liked Satakarni Over Baahubali     2017-01-17   21:36:12  IST  Raghu V

బాహుబలి ఒక అద్భుతమని, హాలివుడ్ కి మనదేశం ఇచ్చిన జవాబు అని అంతా పొగడ్తల వర్షం కురిపించి, ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రభుత్వం అవార్డు ఇస్తే, అలనాటి నటి జమున మాత్రం బాహుబలి ఒక స్టుపిడ్ ఫిలిం అని కామెంట్ చేసిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఆవిడకి మన జక్కన చెక్కిన గ్రాఫిక్స్ కళాఖండం అస్సలు నచ్చలేదట.

కాని, తాజాగా వచ్చిన మరో విజువల్ ట్రీట్ గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం బాగా నచ్చిందట. గౌతమీపుత్ర శాతకర్ణి మరచిపోయిన చరిత్ర చెప్పనందువల్ల, బాలకృష్ణ్ అద్భుతమైన నటన వలన ఈ సినిమా బాగుందని, అలాగే బాలకృష్ణ గెటప్ కూడా బాగుందని పొగిడేసారు. మొత్తానికి జమున గారి దగ్గర రాజమౌళి కన్నా ఎక్కువ మార్కులు క్రిష్ కొట్టేసాడన్నమాట.

ఎవరి అభిరుచి వారిది. కాని ఆవిడ అప్పుడల్లా సూటిగా బాహుబలిని విమర్శించడం అప్పట్లో చాలామందికి నచ్చలేదు. ఏదైతేం ఏం … ఆ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా గుర్తింపు పొందింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.