పవన్ కళ్యణ్ నిజాయితీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నరేష్

సీనియర్ హీరో, నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ హీరోగా రాణించిన నరేష్ తరువాత టర్న్ తీసుకొని ప్రస్తుతం స్టార్ నటుడుగా కొనసాగుతున్నాడు.

 Senior Actor Naresh Comments On Pawan Kalyan-TeluguStop.com

కామెడీ టైమింగ్ తో తండ్రి పాత్రలతో పాటు ఇతర పాత్రల కోసం కూడా దర్శకులు ఇప్పుడు నరేష్ ని ఫస్ట్ ఛాయస్ గా చూసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా ఎవరు స్పందించడం లేదు.అయితే వైఎస్ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉన్న నరేష్ మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై జనసేన అభిమానులు సంతోషించే కామెంట్స్ చేశారు.

ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే వంద కోట్లు వరకు ఖర్చు పెడుతున్న పరిస్థితి.అలాంటి రాజకీయాలలోకి తనుకున్న స్టార్ ఇమేజ్ ని, కోట్ల సంపాదన, ఏసీ గదులలో రాజభోగాలని వదిలేసుకొని జనం మధ్యకి వచ్చాడు.

అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు ప్రస్తుత రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి కచ్చితంగా అవసరం ఉంది.రాజకీయాలని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని, డబ్బు, మద్యం, కులం అనేవి లేని రాజకీయ వ్యవస్థ ఉండాలనే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయాణం నాకైతే నచ్చింది.

అందుకే వ్యక్తిగతంగా ఆతనికి నా సపోర్ట్ ఉంటుంది.ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడేవారు ఎవరైనా సిగ్గు లేని వారేనని అన్నారు.ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయని వాటి కారణంగా కుటుంబ బంధాలు సరైన విధంగా ఉండవు, వాటిని రాజకీయాలతో ముడిపెట్టడం చూస్తుంటే వారికి పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి మారే అంశం లేదని అర్ధమవుతుందని అన్నారు.వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని ఘాటుగా చెప్పారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నరేష్ అన్న మాటలు సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలకి సంతోషాన్ని ఇచ్చాయని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube