రెబల్ స్టార్ చేపల పులుసు... వాసన పీలిస్తే నోరూరాల్సిందే?

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ, సినీ ప్రముఖులు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.ఎప్పుడూ కిచెన్ మొహం చూడని నటులు సైతం వంటలు చేసి తమ టాలెంట్ ను బయటపెడుతున్నారు.

 Senior Actor Krishnam Raju Makes Fish Curry Family-TeluguStop.com

తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు చేపల పులుసు చేయగా ప్రభాస్ సోదరి ప్రసీద ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నాన్న వీకెండ్ వంటకం అంటూ ప్రసీద పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ప్రసీద పోస్ట్ లో వీకెండ్ స్పెషల్ గా డాడీ చేపల పులుసు చేశారని… చేపల పులుసు చేయడంలో తన తండ్రిని మించిన వాళ్లు లేరని… వాసన చూసి పులుసులో ఉప్పు సరిపోయిందో లేదో చెప్పేంత ఎక్స్ పర్ట్ తండ్రి అని ఆమె పేర్కొన్నారు.సోషల్ మీడియాకు దూరంగా ఉండే కృష్ణంరాజు ఈ వీడియో వల్ల నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నారు.

 Senior Actor Krishnam Raju Makes Fish Curry Family-రెబల్ స్టార్ చేపల పులుసు… వాసన పీలిస్తే నోరూరాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియో ద్వారా రాజుగారు తనలోని కుకింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేశారు.

కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గరిటె పట్టి ఫిష్ ఫ్రై వండి ప్రశంసలు అందుకోగా ప్రస్తుతం కృష్ణంరాజు జనాల ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలోని వీడియోపై పాజిటివ్ గా స్పందిస్తూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాహుబలి పెదనాన్న వండిన చేపల పులుసు వాసన పీలిస్తే నోరూరాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు.

రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు వంటల విషయంలో కూడా రాయల్ గా ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.