వేషాలు ఇవ్వమని దర్శకులను అడుగుతున్న కోట శ్రీనివాసరావు… కారణం అదే

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా విభిన్న పాత్రల్లో మెప్పించిన అతి కొద్దిమంది నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు.

టాలీవుడ్ లో గొప్ప నటుల జాబితాలో ఇతనికి కూడా ఖచ్చితంగా ఒక స్థానం లభిస్తుంది.

కెరియర్ లో ఎవరు చేయని విభిన్నమైన పాత్రలు చేసి ప్రశంసలు అందుకున్నారు.

అలాగే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజ్ పురి సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

ఎలాంటి పాత్ర చేసిన అందులోకి పరకాయ ప్రవేశం చేసి, కేవలం పాత్రలు మాత్రమే కనిపించే విధంగా నటించడంలో కోట శ్రీనివాసరావు బెస్ట్ అని చెప్పాలి.