వేషాలు ఇవ్వమని దర్శకులను అడుగుతున్న కోట శ్రీనివాసరావు… కారణం అదే  

Senior actor Kota Srinivasa Rao costing characters, Bollywood, Tollywood, Telugu cinema, South cinema, senior actors - Telugu Bollywood, Senior Actor Kota Srinivasa Rao Costing Characters, Senior Actors, South Cinema, Telugu Cinema, Tollywood

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా విభిన్న పాత్రల్లో మెప్పించిన అతి కొద్దిమంది నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు.టాలీవుడ్ లో గొప్ప నటుల జాబితాలో ఇతనికి కూడా ఖచ్చితంగా ఒక స్థానం లభిస్తుంది.

 Senior Actor Kota Srinivasa Rao Costing Characters

కెరియర్ లో ఎవరు చేయని విభిన్నమైన పాత్రలు చేసి ప్రశంసలు అందుకున్నారు.అలాగే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజ్ పురి సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

ఎలాంటి పాత్ర చేసిన అందులోకి పరకాయ ప్రవేశం చేసి, కేవలం పాత్రలు మాత్రమే కనిపించే విధంగా నటించడంలో కోట శ్రీనివాసరావు బెస్ట్ అని చెప్పాలి.దేశంలో గొప్ప నటులలో ఇతనికి కూడా ఖచ్చితంగా ఒక స్థానం ఉంటుంది.

వేషాలు ఇవ్వమని దర్శకులను అడుగుతున్న కోట శ్రీనివాసరావు… కారణం అదే-Movie-Telugu Tollywood Photo Image

ఎంత గొప్ప నటుడైన ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.

ప్రస్తుతం అదే పరిస్థితి కోట శ్రీనివాసరావు ఎదుర్కొంటున్నారు.

వయసురీత్యా అతనికి సరిపోయే పాత్రలు దర్శకులు కూడా సృష్టించపోవడంతో పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఒకవేళ చేసినా కూడా చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలు మాత్రమే లభిస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావు తరచుగా దర్శకులను సంప్రదిస్తూ తనకు అవకాశం కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇలా అడగడంలో తప్పేమీ లేదని ఆయన అంటున్నారు.

ఇంతకాలం సినిమాలలో విభిన్న పాత్రలు చేసి ప్రస్తుతం ఖాళీగా ఉండమంటే తనలాంటి వాళ్లకు అది సాధ్యం కాదని ఆయన చెబుతున్నారు.ఈ కారణంగానే తనకు సరిపోయే పాత్రలు ఉంటే చెప్పాలని దర్శకులను అడుగుతున్నట్టు తెలుస్తుంది.

కోట శ్రీనివాసరావు మీద గౌరవంతో కొంతమంది సినిమాలో ప్రత్యేక పాత్రలో సృష్టించి అతనికి అవకాశం ఇస్తున్నారు.వయసు రీత్యా ఈ సినిమాలో కీలక పాత్రలు కాకుండా కథలో భాగంగా వచ్చే పాత్రలలో ఆయనకి అవకాశం ఇస్తున్నారు.

ఏది ఏమైనా ఒక గొప్ప నటుడు ఈ వయసులో కూడా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

#Senior Actors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Senior Actor Kota Srinivasa Rao Costing Characters Related Telugu News,Photos/Pics,Images..