వైసీపీ ని విడి బీజేపీలో చేరిన ప్రముఖ నటి..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి పార్టీ గతంలో కంటే క్రియా శీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన బిజెపి 2019 ఎన్నికలలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానం కూడా దక్కించుకోలేదు.

 Senior Actor Hema Join In Bjp-TeluguStop.com

కానీ తెలంగాణలో మాత్రం ముందస్తు ఎన్నికలలో గెలవకపోయినా తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఇటీవల దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఊహించని విధంగా స్థానాలు గెలిచి అధికార పార్టీ టిఆర్ఎస్ కి మంచి పోటీ ఇస్తూ ఉంది.

ఇలాంటి తరుణంలో బిజెపి పార్టీలో చాలావరకు చేరికలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి.

 Senior Actor Hema Join In Bjp-వైసీపీ ని విడి బీజేపీలో చేరిన ప్రముఖ నటి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ నటి విజయశాంతి దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి తీర్థం పుచ్చుకోవడం అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ నటి హేమ ఏపీ బీజేపీ లో జాయిన్ అయ్యారు.తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో సోము వీర్రాజు సమక్షంలో హేమా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.2019 ఎన్నికల సమయంలో వైసీపీలో జాయిన్ అయిన హేమ తాజాగా బిజెపిలో జాయిన్ అవ్వడంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బిజెపిలో తాను సేవకురాలిగా జాయిన్ అయినట్లు హేమ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా చూడటం జరిగిందని చాలా బాగుందని మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా పవన్ కళ్యాణ్ చేశారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

#Hema #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు