త్రిషకు సీనియర్ నటుడు కారు గిఫ్టు.. ఆమెతో పెళ్లి కోసమే ఈ గిఫ్ట్ స్టోరీ?

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో నటన, అందం విషయంలో టాప్ హీరోయిన్ లలో మొదటి స్థానంలో ఉన్న ముద్దుగుమ్మ త్రిష.తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

 Senior Actor Car Gift To Trisha Is This Gift To Marrying Her-TeluguStop.com

ఇక తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ల మనసులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటులను, దర్శక నిర్మాతలను కూడా ఫిదా చేసింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా ఈమెకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.

 Senior Actor Car Gift To Trisha Is This Gift To Marrying Her-త్రిషకు సీనియర్ నటుడు కారు గిఫ్టు.. ఆమెతో పెళ్లి కోసమే ఈ గిఫ్ట్ స్టోరీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈమెను పెళ్లి చేసుకోవడం కోసం ఓ సీనియర్ నటుడు ఏకంగా ఒక కారునే గిఫ్ట్ గా ఇచ్చాడట.

తెలుగు సినీ ఇండస్ట్రీకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో 2003లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా మాత్రం తనకు అంత సక్సెస్ ఇవ్వలేదు.కానీ ఆ తర్వాత ఆమె నటించిన వర్షం సినిమా మాత్రం ఆమె కెరీర్ నే మార్చేసింది.

ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించగా.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘దూకుడు’గా వ్యవహరిస్తున్న శ్రీనువైట్ల.

మహేష్ తో మరోసారి.!

తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించింది.

ఇక ఈమెకు పలు అవార్డులు కూడా అందాయి.ఈమె అందాల పోటీలలో కూడా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎన్నికయింది.

గతంలో సినీ ఇండస్ట్రీకి దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో పలు సినిమాలలో నటిస్తుంది.ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే గతంలో ఈమెకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి.

అందులో ఓ సీనియర్ నటుడు ఏకంగా ఈమెను మానసికంగా చాలా బాధ పెట్టాడని తెలిసింది.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.ఈమెను పెళ్లి చేసుకోవడానికి అతడు కాస్త కొత్తగా ప్రపోజ్ చేశాడు.

అది కూడా ఆమెకు ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇక ఈ విషయం అప్పట్లో సినీ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారగా.

ఈ విషయం తో త్రిష బాగా మానసికంగా ఇబ్బంది పడిందని తెలిసింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేసింది.ఇవన్నీ తట్టుకోలేక గతంలో ఈమె ఓ బిజినెస్ మాన్ ను నిశ్చితార్థం చేసుకుంది.కానీ పెళ్లి సమయానికి వారి మధ్య బ్రేకప్ జరిగింది.

ఇక ఈ మధ్య తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఈ విషయం గురించి త్రిష తన నోటి ద్వారా చెబితేనే తెలుస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#Trisha Personal #Trisha Love #Trisha Krishnan #Trisha #SeniorCar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు