సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు సినిమాలను చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బ్రహ్మాజీ వయస్సు 57 సంవత్సరాలు కాగా చూడటానికి మాత్రం ఆయన 35 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు.

 Senior Actor Brahmaji Favoruite Hero Details Here Goes Viral ,  Actor Brahmaji ,-TeluguStop.com

ఒక ఇంటర్యూలో బ్రహ్మాజీ మాట్లాడుతూ సినిమాలకు, ఇతర విషయాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.తన ఫేవరెట్ హీరో కృష్ణ అని బ్రహ్మాజీ చెప్పడం గమనార్హం.

తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి బ్రహ్మాజీ హాజరు కాగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చి 28 సంవత్సరాలు అవుతోందని తెలిపారు.తాను నటుడిని కావడంతో ఐఏఎస్, ఐపీఎస్ లకు దక్కిన స్థాయిలో గుర్తింపు దక్కుతోందని నటుడు కావడం అనేది అదృష్టం అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

నా సినీ లైఫ్ లో ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగుందని ఎవరికైనా సెకండాఫ్ బాగుండాలని నేను కోరుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.

కర్మ సిద్ధాంతం అనేది ఉంటుందని మన అకౌంట్ లో మనం ఎంత విత్ డ్రా చేసుకోవాలో అంత చేసుకుంటామని బ్రహ్మాజీ వెల్లడించారు.

రవితేజ, నేను చెన్నైలో కలిసేవాళ్లం అని అక్కడ చాలా స్ట్రగుల్స్ అనుభవించామని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.నన్ను సినిమాలో పెట్టుకుంటే గొప్ప డైరెక్టర్ అవుతావని కృష్ణవంశీకి చెప్పి ఆయన సినిమాలో నటించానని బ్రహ్మాజీ వెల్లడించారు.

బయటి అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

Telugu Brahmaji, Favoruite, Krishna, Heart Rk-Movie

బెంగాళీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని బ్రహ్మాజీ వెల్లడించారు.కొందరు ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలోనే కనిపిస్తారని వాళ్లకు సినిమాలలో ఆఫర్లు ఉండవని ఆయన తెలిపారు.నాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు.

రాజకీయాలు రొట్ట అయిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు.బ్రహ్మాజీ మరిన్ని సినిమా ఆఫర్లు అందుకొని కెరీర్ ను అద్భుతంగా కొనసాగించాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube