సూపర్ హెయిర్ స్టైల్ లో ఫేమస్ అయిపోయిన ఏనుగు  

sengamalam elephant famous in social Media, Mannargudi, Tamil Nadu, Animals, Hindu Temples - Telugu Animals, Hindu Temples, Mannargudi, Sengamalam Elephant Famous In Social Media, Tamil Nadu

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందులో చాలా విషయాలు వైరల్ అయిపోతున్నాయి.అలాగే ప్రపంచంలో ఏ మూల ఎలాంటి విషయం జరిగిన క్షణాలలో తెలిసిపోతుంది.

 Sengamalam Elephant Social Media Mannargudi

అలాగే ప్రపంచం మొత్తం అందరికి చేరిపోతుంది.అలాగే ఈ మధ్యకాలంలో కొంత మంది సోషల్ మీడియాలో అలాగే రాత్రికి రాత్రి స్టార్స్ గా మారిపోయారు.

సామాన్యులకి కూడా సోషల్ మీడియా ఊహించని హైప్ ని క్రియేట్ చేసి ఫేమస్ చేసింది.అయితే ఇప్పుడు అలాగే ఒక ఏనుగు ఉన్నపళంగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపొయింది.

సూపర్ హెయిర్ స్టైల్ లో ఫేమస్ అయిపోయిన ఏనుగు-General-Telugu-Telugu Tollywood Photo Image

దానికి కారణం ఆ ఏనుగుకి ఉన్న హెయిర్ స్టైల్.తమిళనాడు రాష్ట్రం హైందవ దేవాలయలు ఎక్కువగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే.

చాలా ఆలయాల్లో ఆస్థాన కైంకర్యాల నిమిత్తం ఏనుగులను పోషిస్తుంటారు.

ఇప్పుడు మన్నార్ గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉన్న సెంగమాలమ్ అనే ఏనుగు ఊహించని విధంగా ఫేమస్ అయిపొయింది.

మిగిలిన ఏనుగులకి భిన్నంగా సెంగమాలమ్ చక్కని హెయిర్ స్టయిల్ తో దర్శనమిస్తుంది.అది కూడా బాబ్డ్ కట్ తో.దీనికి ఇంటర్నెట్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.సెంగమాలమ్ ఫొటో పోస్టు చేస్తే చాలు విపరీతంగా లైకులు పోటెత్తుతాయి.

బాబ్డ్ కట్ సెంగమాలమ్ అంటే సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.సెంగమాలమ్ స్వస్థలం కేరళ.

అయితే 2003లో దాన్ని మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకువచ్చారు.దీని మావటి రాజగోపాల్ దీనికి ప్రత్యేకమైన క్రాఫ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు.

సెంగమాలమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది.

#Hindu Temples #Animals #Mannargudi #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sengamalam Elephant Social Media Mannargudi Related Telugu News,Photos/Pics,Images..