సేవ్ చేయని ఫోన్ నంబర్ కు వాట్సాప్ మెస్సేజ్ పంపండిలా..!

వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ముందుగా వారి మొబైల్ నెంబర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో చేయాల్సి ఉంటుంది.అయితే కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ చేయడానికి వీలుపడదని అందరికి తెలుసు.

 Send Whatsapp Message To Unsaved Phone Number,  Whatsapp, Services, Latest, Mes-TeluguStop.com

ఒకవేళ నెంబర్ సేవ్ చేయకుండా ఇతరులకు మీ స్మార్ట్ ఫోన్ నుండి మెసేజ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇది వీలుపడదు.ఇందుకోసం మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది.

వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మీరు ఎవరి నెంబర్‌కు వాట్సప్ మెసేజ్ పంపాలనుకున్నా పంపొచ్చు.

వారి నెంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండాల్సిన అవసరం లేదు.సాధారణంగా ఇలా చేయడానికి కొందరు కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తారు.

కానీ ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా మీరు నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్ లో మెసేజ్ చేయవచ్చు.

మరి మెసేజ్ ఎలా పంపాలంటే.

మొదట మీ డెస్క్ టాప్ లో బ్రౌజర్ ఓపెన్ చేయండి.బ్రౌసర్ లో https://wa.me/ అని టైప్ చేసి ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఫోన్ నెంబర్‌లో కంట్రీకోడ్ కూడా తప్పనిసరిగా ఉండాలి.

ఉదాహరణకు మొబైల్ నెంబర్ 8969998888 అనుకుంటే ఇండియా కంట్రీకోడ్ 91 కాబట్టి 91896998888 అనే నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.అంటే మీరు https://wa.me/91999988888 అని టైప్ చేసి యూఆర్‌ఎల్‌ లో ఎంటర్ చేయాలి.ఆ తర్వాత Continue to Chat పైన క్లిక్ చేయాలి.

అనంతరం Open WhatsApp క్లిక్ చేస్తే వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ ఓపెన్ అవుతుంది.ఆ తర్వాత ఛాటింగ్ చేయొచ్చు.

మీరు ఆ వాట్సప్ నెంబర్‌కు రెగ్యులర్‌గా ఛాటింగ్ చేసేట్టైతే నెంబర్ సేవ్ చేసుకోవచ్చు.

Send WhatsApp Message To Unsaved Phone Number, WhatsApp, Services, Latest, Messages, Seved Number WhatsApp, Services, Latest, Messages, Seved Number - Telugu Latest, Messages, Sendwhatsapp, Seved Number, Whatsapp #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube