గాల్వన్ ఘర్షణ: భారత్‌కు మద్ధతుగా మరో అమెరికన్ సెనేటర్.. చైనాపై విమర్శలు

గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.

 Us Senator Marco Rubio , Expressed Solidarity,india Over Ladakh Face-off ,china-TeluguStop.com

రెండు దేశాలు సరిహద్దుల్లో పోటాపోటీగా సైన్యం, ఆయుధ సంపత్తిని తరలించాయి.దీంతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావొచ్చనే వార్తలతో ప్రపంచం కలవరపాటుకు గురవుతోంది.

చైనాపై ప్రతీకార చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌ని భారత్ నిషేధించింది.ఈ చర్యతో పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు భారత్‌కు మద్ధతు పలికేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.తాజాగా అమెరికన్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నేత మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు.

బీజింగ్‌కు భయపడేది లేదని ఇండియా స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో మాట్లాడి స్పష్టం చేశానన్నారు.ఈ ఘటనపై రూబియో ఇది వరకే చైనాను లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు.

-Telugu Visual Story Telling

కాగా, గాల్వన్‌లో చైనా ఘర్షణకు పాల్పడినట్లు మరో సెనేటర్ మిచ్ మెక్‌కానెల్ వారంలోనే రెండోసారి ఆరోపించారు.భారత్‌పై చైనా దూకుడుగా వ్యవహరించిందని మండిపడ్డారు.అంతకుముందు, సెనేటర్ టామ్ కాటన్ చైనా హింసాత్మక వైఖరిని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.జపాన్ భూభాగాల్లోకి జలాంతర్గామి చొరబాట్లు చేయడం ద్వారా భారతదేశంతో హింసాత్మక ఘర్షణలను చైనా తిరిగి ప్రారంభించిందని అర్కాన్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీకే చెందిన మరో సెనేటర్ టామ్ కాటన్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube